కరోనా మహమ్మారి : ప్రపంచ వ్యాప్తంగా 7 వేలకుపైగా మృతి…ఇటలీలోనే 3,240 మంది మృత్యువాత
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది.

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది. మరో లక్షా 80వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,213 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీలో మరణ మృదంగం మోగిస్తోంది కోవిడ్-19. ఇటలీలో ఇప్పటి వరకు 2,158 మంది మరణించారు. సోమవారం ఒక్కరోజే ఇటలీలో 349 మంది చనిపోయారు. ఇక ఇరాన్‌లో 853, ఫ్రాన్స్‌లో 127, దక్షిణ కొరియాలో 75, అమెరికాలో 71, యూకేలో 36, జపాన్‌లో 25, నెదర్లాండ్స్‌లో 20 మంది చనిపోయారు.
స్పెయిన్‌లో కరోనా కరాళ నృత్యం
స్పెయిన్‌లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. స్పెయిన్ లో మొన్న ఒకేరోజు రికార్డు స్థాయిలో వంద మంది మృతి చెందగా.. నిన్న 41మంది మృత్యువాత పడ్డారు. 14వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు స్పెయిన్‌లో 9వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 335 మంది మృతిచెందారు.దీంతో స్పెయిన్ ప్రభుత్వ మరింత అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అనేక కార్యాలయాలను మూసివేసింది. ప్రయాణాలను రద్దు చేసుకోవాలని దేశ ప్రజలకు సూచించింది.
బహ్రెయిన్‌లో తొలి కరోనా మరణం
గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లోతొలి కరోనా మరణం నమోదైంది. ఇరాన్ నుంచి వచ్చిన 65 ఏళ్ల మహిళ ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే… ఆమె ప్రయాణం తర్వాత ఎవరినీ నేరుగా కలవలేదని.. ఐసోలేషన్ వార్డులోనే ఉన్నారు కాబట్టి.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటిదాకా బహ్రెయిన్‌లో 214 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కరోనా అనుమానితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది.
సౌదీ అరేబియా, కువైట్..అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధం
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ అరేబియా, కువైట్ దేశాలు యుద్ధం ప్రకటించాయి. అంతర్జాతీయ ప్రయాణాలన్నింటిపై నిషేధం విధించాయి. జిమ్ములు, పబ్లిక్ పార్కులు, స్పాలను మూసివేశాయి. మరోవైపు… కరోనా వ్యాప్తితో అంతర్జాతీయ చమురు ధరలు దిగివస్తున్న వేళ… తమ మార్కెట్‌కు అండగా నిలిచేందుకు అబుదాబి సోమవారం భారీగా నిధులు కేటాయించింది. క్యాపిటల్ మార్కెట్ లిక్విడిటీని పెంచేందుకు వన్ బిలియన్ దీరాంలు విడుదల చేసింది. కరోనా కారణంగా నష్టపోతున్న చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకునేందుకు సౌదీ అరేబియా 50 బిలియన్ రియాల్ విడుదల చేసింది. ఖతార్ సైతం కరోనాను ఎదుర్కొనేందుకు 20.5 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది.
See Also | భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా…15 రాష్ట్రాల్లో 114 కేసులు