Telangana Woman : అమెరికా వీధుల్లో నిస్సహాయ స్థితిలో తెలంగాణ మహిళ.. తమ కుమార్తెను ఇండియాకు రప్పించాలంటూ వేడుకుంటున్న తల్లి

అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన ఓ యువతి నిస్సహాయస్థితిలో చికాగో రోడ్లపై దయనీయంగా తిరుగుతోంది. డిప్రెషన్‌తో బాధపడుతూ, ఆకలికి అలమటిస్తూ ఉన్న ఆమె పరిస్థితి తెలుసుకున్న తల్లి విదేశాంగ మంత్రికి లేఖ రాసింది. తమ కూతురిని తమ వద్దకు చేర్చమంటూ ఆమె వేడుకుంటోంది. ఆమె రాసిన లేఖ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Telangana Woman : అమెరికా వీధుల్లో నిస్సహాయ స్థితిలో తెలంగాణ మహిళ.. తమ కుమార్తెను ఇండియాకు రప్పించాలంటూ వేడుకుంటున్న తల్లి

America

Telangana Woman – America : మాస్టర్స్ చేసేందుకు హైదరాబాద్ (Hyderabad) అమ్మాయి అమెరికా వెళ్లింది. ఏమైందో ఏమో తీవ్రమైన డిప్రెషన్‌లో చికాగో (Chicago) రోడ్లపై కనిపించింది. ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను భారత్‌కు రప్పించేందుకు సాయం చేయమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ (S Jaishankar) కు లేఖ రాసింది. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rice Export Ban: అమెరికాలో మనోళ్ల బియ్యం కష్టాలు.. వైరల్ అవుతున్న వీడియోలు

మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు హైదరాబాద్ మౌలాలీకి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ ఆగస్టు 2021 లో డెట్రాయిట్ వెళ్లింది. అక్కడి TRINE యూనివర్సిటీలో చేరిన తరువాత ఫ్యామిలీకి టచ్‌లో ఉండేది. రెండు నెలలుగా ఆమె టచ్‌లో లేకుండా పోయింది. ఆమె డిప్రెషన్ లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని, ఆకలితో అలమటిస్తోందని.. చికాగో రోడ్లపై ఆమె కనిపించిందని ఇద్దరు హైదరాబాద్ యువకులు ద్వారా ఆమె తల్లికి తెలిసింది. వెంటనే ఆమె తన కూతుర్ని ఇండియాకు రప్పించేలా తమకు సాయం చేయమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను వేడుకుంటూ లేఖ రాశారు. ఆ లేఖను భారత రాష్ట్ర సమితి నాయకుడు ఖలీకర్ రెహమాన్ (@Khaleeqrahman) ట్విట్టర్‌లో షేర్ చేశారు.

America : అమెరికాలో భారతీయ విద్యార్థినిపై పిడుగుపాటు.. మెదడు,గుండెపై ప్రభావం..మృత్యువుతో పోరాటం

‘హైదరాబాద్ నుండి మిస్.సయ్యదా లులు మిన్హాజ్ జైదీ TRINE యూనివర్సిటీ, డెట్రాయిట్ లో MS చేయడానికి చికాగో వెళ్లారు. అక్కడ చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఆమె తల్లి విజ్ఞప్తి మేరకు ఆమెను తిరిగి ఇండియాకు తీసుకురావడంలో తక్షణ సాయాన్ని అందిస్తాను’ అనే శీర్షికతో విదేశాంగ మంత్రి Dr S జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ బాధితురాలి వివరాలు, తల్లి రాసిన లేఖను ఖలీకర్ రెహమాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. సయ్యదాకు సాయం అంది ఇండియాకు క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.