Elon Musk: ట్విటర్ పోల్ ఎఫెక్ట్ .. సీఈఓ పదవి నుంచి వైదొలుగుతానన్న మస్క్.. కానీ ఒక షరతు..

ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ట్విటర్ పోల్‌లో నెటిజన్లు ఇచ్చిన తీర్పుతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Elon Musk: ట్విటర్ పోల్ ఎఫెక్ట్ .. సీఈఓ పదవి నుంచి వైదొలుగుతానన్న మస్క్.. కానీ ఒక షరతు..

Elon Musk

Updated On : December 21, 2022 / 9:03 AM IST

Elon Musk: ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ట్విటర్ పోల్‌లో నెటిజన్లు ఇచ్చిన తీర్పుతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఈఓగా వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నాడు.

Elon Musk: మస్క్‭కు వ్యతిరేకంగా మిలియన్ల ఓట్లు.. ఇంకెప్పుడు తప్పుకుంటావంటూ మండిపడుతున్న నెటిజెన్లు

ట్విటర్ కొనుగోలు తరువాత మస్క్ పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు. దీంతో మస్క్ తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ట్విటర్‌లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా పోల్ నిర్వహిస్తానని మస్క్ తెలిపారు. రెండురోజుల క్రితం మస్క్ ఓ ఆసక్తికరమైన పోల్‌ను ట్విటర్‌లో పోస్టు చేశాడు. తాను ట్విటర్ అధిపతిగా కొనసాగాలా? లేక వైదొలగాలా అనే విషయంపై ఓటు చేయాలని నెటిజన్లకు సూచించారు. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున 4.50 గంటలకు మస్క్ ఈ పోస్టు చేశారు.

 

 

ఈ పోల్‌లో 57శాతం మంది నెటిజన్లు ట్విటర్ సీఈఓ పదవి నుంచి మస్క్ వైదొలగాలని ఓటువేయగా, 43శాతం మంది మాత్రమే వద్దు అని తమ అభిప్రాయం తెలిపారు. దీంతో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ ట్విట్ చేశారు. చీఫ్ ఎగ్జిక్యుటివ్ పదవికి కొత్త వ్యక్తిని నియమించి ఆ తరువాత ఆ బాధ్యతల నుంచి నేను వైదొలుగుతానని మస్క్ స్పష్టం చేశారు.