అంగారకుడిపై నాసా రోవర్ ల్యాండింగ్ : ఆ చివరి 7 నిమిషాల్లో ఏమైనా జరగొచ్చు!

అంగారకుడిపై నాసా రోవర్ ల్యాండింగ్ : ఆ చివరి 7 నిమిషాల్లో ఏమైనా జరగొచ్చు!

Updated On : February 14, 2021 / 9:25 AM IST

Nasa Perseverance rover’s landing on Mars: ప్రముఖ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన మార్స్ మిషన్ మరికొద్ది రోజుల్లో విజయవంతం కానుంది. దాదాపు ఏడు నెలలు ప్రయాణించిన తర్వాత రోవర్ అంగారక గ్రహంపై ల్యాండ్ కాబోతోంది. ముందుగా నిర్దేశించిన లక్ష్యంగా దిశగా రోవర్ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 18న ఈ రోవర్ అంగారక గ్రహంపై అడుగుపెట్టనుంది. ఈ దశ అత్యంత కీలకమైనది.. రోవర్ సేఫ్ గా అంగారకుడిపై ల్యాండ్ అయితే మార్స్ మిషన్ సక్సెస్ అయినట్టే. రోవర్ అంగారకుడిపై ల్యాండ్ అయ్యేందుకు సరిగ్గా ఏడు నిమిషాల సమయం పడుతుంది.

ఈ ఏడు నిమిషాల్లో ఏమైనా జరగొచ్చు అంటున్నారు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇంజినీర్లు. మార్స్ మిషన్ సవాళ్లను వివరిస్తూ ఒక వీడియోను కూడా నాసా విడుదల చేసింది. అంగారక గ్రహం వాతావరణంలోకి రోవర్ ల్యాండ్ అయ్యే సమయం చాలా క్లిష్టమైన చర్య. ఎందుకంటే.. కొంచెం అటు ఇటు అయినా రోవర్ విచ్ఛిన్నమైపోతుంది. ఫిబ్రవరి 18న అంగారక వాతావరణంలో ప్రవేశానికి 10 నిమిషాల ముందు అంతరిక్ష నౌక నుంచి రోవర్ విడిపోతుంది. గంటకు 12,000-13,000 మైళ్ల వేగంతో మార్టిన్ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.


హీట్ షీల్డ్ వాతావరణంలో ఘర్షణ ద్వారా ఉత్పన్నమయ్యే ప్రారంభ శక్తిని వెదజల్లుతుంది. రోవర్ నెమ్మదిగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా నాసా సైంటిస్టులు సూపర్సోనిక్ పారాచూట్‌ను అమర్చుతారు. హీజర్ షీల్డ్‌ను వేరుచేయడం ద్వారా జెజెరో క్రేటర్‌లో సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చేస్తుంది. అలాగే మార్స్ ఉపరితలంపై ల్యాండ్ అయ్యే సమయంలో ఫొటోలను తీయడానికి ఈ టెక్నాలజీని వాడుతారు. రోవర్ ల్యాండింగ్ సైట్‌ను ఇదే నిర్ణయిస్తుంది.

ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మునుపటి మార్స్ మిషన్ కంటే క్లిషమైన వాతావరణంలోకి రోవర్ సేఫ్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతిస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ల్యాండ్ అయ్యే నిర్దేశిత ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత రోవర్ ల్యాండ్ వీలుగా పారాచూట్ ఓపెన్ చేస్తారు ఇంజినీర్లు. రోవర్‌ను సమీపంలోని సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశానికి నడిపించడంలో రాకెట్లు సాయపడతాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జెపిఎల్) వద్ద నిర్మించిన ప్రెజర్వెన్స్ రోవర్, జూలై 30, 2020న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు.