డొరియన్ హరికేన్ విజృంభణ : నాసా మొబైల్ లాంచర్ సేఫ్

అమెరికాలో భీకర హరికేన్ డొరియన్ బీభత్సం సృష్టిస్తోంది. డొరియన్ తుఫాన్ దెబ్బకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పెస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కేండీ స్పెస్ సెంటర్ దగ్గర పెద్ద ప్రమాదం తప్పింది.

  • Published By: sreehari ,Published On : September 7, 2019 / 07:10 AM IST
డొరియన్ హరికేన్ విజృంభణ : నాసా మొబైల్ లాంచర్ సేఫ్

Updated On : September 7, 2019 / 7:10 AM IST

అమెరికాలో భీకర హరికేన్ డొరియన్ బీభత్సం సృష్టిస్తోంది. డొరియన్ తుఫాన్ దెబ్బకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పెస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కేండీ స్పెస్ సెంటర్ దగ్గర పెద్ద ప్రమాదం తప్పింది.

అమెరికాలో భీకర హరికేన్ డొరియన్ బీభత్సం సృష్టిస్తోంది. డొరియన్ తుఫాన్ దెబ్బకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పెస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కేండీ స్పెస్ సెంటర్ దగ్గర పెద్ద ప్రమాదం తప్పింది. బలమైన వీదురు గాలుల ధాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంచింగ్ పాక్షికంగా అంతరాయం ఏర్పడింది. కేండీ స్పెస్ సెంటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. తుఫాన్ తీవ్రతకు కేండీ స్పెస్ సెంటర్‌లో హార్డ్ వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఎలాంటి ముప్పు లేదని సురక్షితంగానే ఉందని నాసో స్పష్టం చేసింది. ‘ఫ్లయిట్ హార్డ్ వేర్ ధ్వంసం కాలేదు. కేండీ స్పెస్ సెంటర్‌లో సురక్షితంగానే ఉంది. ఈ విషయాన్ని రిపోర్టు చేయడం సంతోషంగా ఉంది. ’అని నాసా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. శనివారం (సెప్టెంబర్ 7) ఉదయమే స్పెస్ సెంటర్‌ను సాధారణ వ్యవహారాల కోసం తిరిగి ఓపెన్ చేసినట్టు తెలిపింది. 

డొరియన్ తుఫాన్ బీభత్సం అనంతరం కేండీ స్పెస్ సెంటర్ లోని గిగాంటిక్ వెహికల్ అసెంబ్లీ బుల్డింగ్ (VAB) సురక్షితంగా ఉన్నట్టు ఏరియల్ ఫుటేజీని నాసా విడుదల చేసింది. ఈ వారంలోనే నాసా సోషల్ మీడియాలో డొరియన్ తీవ్రతకు సంబంధించి వీడియోను కూడా ట్విట్టర్ లో పోస్టు చేసింది. తుఫాన్ తీవ్రత కారణంగా స్పెస్ సెంటర్ లోని కంట్రోల్ సెంటర్ పార్కింగ్ దగ్గర 62కిలోమీటర్ల వేగంతో గాలులు… భారీ వర్షం కురిసింది. 70 నాటికల్ మైళ్ల వేగంతో వీదురు గాలులు వీసినట్టు నాసా తెలిపింది. 250 అడుగుల టవర్ దగ్గర 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టు కేండీ స్పెస్ సెంటర్ ట్వీట్ చేసింది.

నాసా ఎ120 సిబ్బంది వెంటనే అప్రమత్తమై తుఫాన్ ప్రభావం నుంచి కీలకమైన ఇన్ ఫ్రాస్ట్ర్రక్చర్  లాంచింగ్ ప్రక్రియను జాగ్రత్తగా మానిటరింగ్ చేసినట్టు నాసా పేర్కొంది. డొరియన్ తుఫాన్ నుంచి రక్షించేందుకు ఆగస్టు 30న మొబైల్ లాంచర్‌ను వెహికల్ అసెంబ్లీ బుల్డింగ్‌కు సురక్షితంగా తరలించినట్టు నాసా తెలిపింది. అమెరికా స్పెస్ భవిష్యత్తుకు మొబైల్ లాంచర్ ఎంతో కీలకం. కేండీ స్పెస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ 39B నుంచి నానా స్పెస్ లాంచ్ సిస్టమ్ రాకెట్, ఒరియన్ స్పెస్ క్రాఫ్ట్ ను చంద్రునిపై నాసా భవిష్యత్తులో ప్రయోగాలకు వినియోగించనుంది.