కరోనా తగ్గేందుకు 70 రకాల మందులు కనుగొన్న రీసెర్చర్స్

ఓ అంతర్జాతీయ బృందం కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైంది. 69 రకాల మందులతో ఏవైనా కాంబినేషన్ సెట్ చేసి కరోనాను తగ్గించొచ్చని అంటున్నాయి. వీటిలో ఇప్పటికే వైరస్ కంట్రోల్ చేసే క్రమంలో డాక్టర్లు వాడుతూనే ఉన్నారు. bioRxiv అనే వెబ్ సైట్‌లో సైంటిస్టులు ఇలా రాసుకొచ్చారు. 29 రకాల కరోనా వైరస్ జీన్స్‌లలో 26రకాలపై పరిశోధన చేశారు.
అందరిలా కాకుండా ఈ టీం విభిన్నమైన పరిశోధన చేసింది. అందులో భాగంగా వైరల్ ప్రొటీన్లు కానటువంటి కొత్తగా వచ్చే ప్రొటీన్లను టార్గెట్ చేశారు. మనుషుల్లో ఉండే ప్రొటీన్లపై SARS-CoV-2 పనిచేసే విధానాన్ని గమనించారు. ఇందులో మానవ శరీరంలో ఉండే 332 ప్రొటీన్లు SARS-CoV-2తో కలిసిపోతున్నట్లు తెలిసింది. ఈ ప్రొటీన్లే ప్రపంచవ్యాప్తంగా 21వేల మంది ప్రాణాలు బలిగొనగా 4 లక్షల 71 వేలమందికి కరోనా సోకేలా చేశాయి.
ఈ ప్రొటీన్ల పనిచేసేందుకు 69రకాల డ్రగ్స్ ఉన్నట్లు రీసెర్చ్ లో తెలిసింది. వీటిని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ఆమోదించింది. ఈ మందులు నిజానికి టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, హైపర్ టెన్షన్ లు తగ్గించడానికి వాడతారు. ఈ వైరల్ ప్రొటీన్లు అన్ని కలిపి ఒక మానవ ప్రొటీన్ పై దాడి చేయగలవు. ఇతర ప్రొటీన్లు అయితే మనిషిలో ఉండే డజన్ల కొద్దీ ప్రొటీన్లపై దాడి చేస్తుంటాయి.
అధికారికంగా COVID-19ను తగ్గించేందుకు ఎటువంటి యాంటి వైరల్ డ్రగ్ ను కనుగొనలేకపోయారు వైద్యులు. దురదృష్టవశాత్తు సైంటిఫిక్ బ్యాచ్ కు మాలిక్యులర్లపై పూర్తి స్థాయి పరిజ్ఞానం లేదని ఓ ఆర్టికల్ లో రాసుకొచ్చారు. కొత్తగా వచ్చే ప్రొటీన్లపై దాడి చేస్తున్నాయనే అంశాన్ని కనుగొనడం కరోనాకు మందు తెలుసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది.
Also Read | నో ఎగ్జామ్..ఆల్ పాస్ : పరీక్షలు లేకుండానే పై తరగతికి