Nepal Flash Floods : నేపాల్‌లో వరద బీభత్సం.. 3 భారతీయులు గల్లంతు

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఏడుగురు మృతిచెందారు. 20 మంది గల్లంతు కాగా.. వారిలో భారతీయులు ముగ్గురు, చైనాలో మరో ముగ్గురు గల్లంతయ్యారు.

Nepal Flash Floods : నేపాల్‌లో వరద బీభత్సం.. 3 భారతీయులు గల్లంతు

Nepal Flash Floods Wreak Havoc In Sindhupalchok

Updated On : June 18, 2021 / 6:46 AM IST

Nepal Flash Floods : నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఏడుగురు మృతిచెందారు. 20 మంది గల్లంతు కాగా.. వారిలో భారతీయులు ముగ్గురు, చైనాలో మరో ముగ్గురు గల్లంతయ్యారు. నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. మంచు కరిగి టిబెట్ సరిహద్దులోని సింధుపాల్ చౌక్ జిల్లాలో వరదలు సంభవించాయి. హిమానీ నదాలు ఉప్పొంగడం వల్లనే ఈ వరదలు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. నదుల్లో నీటి మట్టం పెరిగి వరద సంభవించింది.

వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పునారావాస కేంద్రాలకు తరలించారు. ఆహారం అందిస్తున్నారు. వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిందని సింధుపాల్ చౌక్ వార్డు చైర్మన్ రుద్రప్రసాద్ తెలిపారు.


స్తంభాలు నేలకూలి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రాంతాల్లో నేపాల్ పోలీసులు సైనికులు సహాయక చర్యలు చేపట్టారు. 200కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. నిరాశ్రయులైన వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు.