కరోనా వైరస్‌లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి : WHO

కరోనా వైరస్ పై నిరంతరం సమీక్షలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)మరో కొత్త విషయాన్ని తెలియజేసింది. కరోనా వైరస్‌లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ప్రతీ రోజు కరోనాపై సమాచారాన్ని సేకరిస్తున్నామనీ..దాని ప్రభావం, లక్షణాల్లో వస్తున్న మార్పుల్ని నిరంతరం గమనిస్తున్నామన్నామనీ..ఈ క్రమంలో కరోనాలో సరికొత్త లక్షణాలు వస్తున్నట్లుగా గమనించామని తెలిపారు.
గతంలో కరోనా సోకినట్లుగా అనుమానించినవారిని పరీక్షించగా వెంటనే పాజిటివ్..లేక నెగిటివ్ అనే తేలేది..కానీ ఇప్పుడు పరీక్షలు నిర్వహించిన కొన్ని రోజుల తరువాత ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. కరోనా వైరస్ జన్యు పరిణామాల క్రమంపై అధ్యయనం చేస్తున్నామనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. కాగా..ఇప్పటికే కరోనా సోని ప్రపంచ వ్యాప్తంగా 3వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలో ఆయా దేశాలు కరోనా కట్టడికి పలు యత్నాలు చేస్తున్నాయి.