U.Kలో New Virus Strain’s : వచ్చే ఏడాదిలో మరిన్ని మరణాలు ?

New Virus Strain Transmissibility : కొత్త రకం కరోనా స్ట్రెయిన్ దెబ్బకు అల్లాడిపోతున్న బ్రిటన్‌కు మరో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే గజగజలాడిస్తున్న కరోనా స్ట్రెయిన్‌కు అదనంగా మరో స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల కాంటాక్ట్స్‌లో ఇద్దరికి ఇది సోకింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి కొన్ని వేల మంది బ్రిటన్‌కు జర్నీ చేశారు. వీరిలో ఎంత మంది ఈ కొత్త స్ట్రెయిన్‌ను వ్యాపింప చేశారోనన్న టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న కరోనా స్ట్రెయిన్ 70 శాతం అధికంగా వ్యాపిస్తోంది.
వచ్చే ఏడాదిలో అధికస్థాయిలో మరణాలు సంభవించే అవకాశాలున్నాయని కొత్త అధ్యయనం వెల్లడిస్తోంది. ఇతర వైరస్‌ల కంటే..56 శాతం వేగంగా ప్రబలే అవకాశం ఉందని పేర్కొంది. Centre for Mathematical Modelling of Infectious Diseases (London School of Hygiene and Tropical Medicine) అధ్యయనం చేపట్టింది. అయితే..ఎక్కువ లేదా..తక్కువ వ్యాపిస్తుందనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది.
కొత్త రకం కరోనాను మించిన వేగంతో వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వైరస్‌కు ఉన్నాయని, ఉత్పరివర్తనం కూడా త్వరత్వరగా జరుగుతుందని అన్నారు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్. కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఇది తమ దేశానికి చేరి ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త రకాల వైరస్ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించి, ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గత 15 రోజుల్లో దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు వెంటనే స్వీయ ఏకాంతానికి వెళ్లాల్సిందిగా కోరారు బ్రిటన్ ఆరోగ్య మంత్రి. ఇక ఈ దక్షిణాఫ్రికా రకం వైరస్‌పై వాయవ్య ఇంగ్లాండ్‌లోని ప్రత్యేక ప్రయోగశాలలో పరీక్షలు చేస్తున్నారు. బ్రిటన్‌లో బుధవారం ఒక్క రోజే 36 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.
Tracking COVID-19 : –
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23 కొత్త కేసులు : 6,93,002
ప్రపంచ వ్యాప్తంగా మరణాలు : 17,33,401
యూఎస్‌లో ఒక్కరోజు కేసులు : 2,28,131