పెళ్లి చేసుకుంటున్న ప్రధాని: నిశ్చితార్ధం అయిపోయింది

  • Published By: vamsi ,Published On : May 4, 2019 / 02:52 AM IST
పెళ్లి చేసుకుంటున్న ప్రధాని: నిశ్చితార్ధం అయిపోయింది

Updated On : May 4, 2019 / 2:52 AM IST

న్యూజిలాండ్ దేశ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. తన చిరకాల స్నేహితుడు క్లార్క్‌ గేఫర్డ్‌తో పెళ్లికి సిద్ధమైన జెసిండా నిశ్చితార్థ కార్యెక్రమంను కూడా పూర్తి చేసుకున్నారు. ఈస్టర్ సెలవుల్లో వారి నిశ్చితార్ధం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. జెసిండాకు ప్రస్తుతం 38ఏళ్లు కాగా, గేఫర్డ్‌కు 41ఏళ్లు.

జెసిండా న్యూజిలాండ్‌కు 40వ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తుంది. 2017లో ప్రధాని అయిన ఆమె.. టీవీ, రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న గేఫర్డ్ ఇంతకుముందు న్యూజిలాండ్‌లో మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి. వీరిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారు. ఈ జంటకు నెవె తె అరోహా అనే 10 నెలల పాప కూడా ఉంది.

2018లో జెసిండా గర్భం ధరించినట్లు వెలువడిన వెంటనే నాయకత్వ విధుల్లో మహిళల పాత్ర పెరిగిందనేందుకు ఇది గొప్ప చిహ్నం అని ప్రపంచం భావించింది.  2018లోనే తన మూడు నెలల పాపను పార్లమెంటుకు ఒడిలో పెట్టుకుని తీసుకుని వచ్చిన జెసిండా అప్పట్లో వార్తల్లో గట్టిగా వినిపించింది.

ప్రధానిగా విధుల్లో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో ప్రధానిగా జెసిండాకు పేరు దక్కింది. జెసిండా కంటే ముందు ఆ ఘనత పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్‌ బుట్టో విధుల్లో ఉండి బిడ్డకు జన్మనిచ్చింది. న్యూజిలాండ్‌కు గత 150ఏళ్లలో అతి తక్కవ వయస్సులో ప్రధాని అయిన ఘనత కూడా ఆమె దక్కించుకుంది.