వండర్ : రాత్రికి రాత్రే గర్భం..నిమిషాల్లోనే పుట్టేసిన బిడ్డ
18 ఏళ్ల యువతి గర్భవతి అయ్యింది. ఇదేం పెద్ద విషయం కాదు విశేషం అంతకన్నా కాదు.

18 ఏళ్ల యువతి గర్భవతి అయ్యింది. ఇదేం పెద్ద విషయం కాదు విశేషం అంతకన్నా కాదు.
18 ఏళ్ల యువతి గర్భవతి అయ్యింది. ఇదేం పెద్ద విషయం కాదు విశేషం అంతకన్నా కాదు. కానీ అసలు విచిత్రం ఏమిటంటే ఆమెకు రాత్రి పడుకునేసరికి గర్భంలేదు కానీ ఉదయం లేచేసరికల్లా గర్బం వచ్చింది..గర్భం అని తెలియని ఆమె పొట్ట ఎత్తుగా కనిపించేసరికి షాక్ అయి ఏమిటాని ఆస్పత్రి వెళ్లే సమయంలోనే కారులో కేవలం 45 నిమిషాల్లో మగబిడ్డను ప్రసవించింది. తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. ఇది వింత కాదని అనగలమా? ఈ ఘటన స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోవ్‌లో జరిగింది.
ఎమ్మలూయిజ్ లెగ్గాటే అనే 18 ఏళ్ల అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ సీన్‌లామౌంట్‌తో కలిసి అమ్మమ్మ లూయిజ్ ఫోర్డ్ ఇంటిలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ పాప కూడా పుట్టింది. ఈ క్రమంలో కొంత కాలానికి ఈ విచిత్ర ఘటన జరిగింది ఎమ్మలూయిజ్ కు. అసలు విషయం ఏమిటంటే..
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు
ఎమ్మలూయిజ్‌కు రాత్రి పడుకునేసరికి మామూలుగానే ఉన్నా..ఉదయం లేచేసరికి కడుపు ఎత్తుగా ఉంది. దీంతో అమ్మమ్మ లూయిజ్ ఫోర్డ్ కు విషయం చెప్పింది. వెంటనే ఎమ్మలూయిజ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లి..కారు పార్క్ చేసి వచ్చేసరికల్లా మనవరాలికి డెలీవరి అయిపోవటం ఓ పండంటి మగబిడ్డ పుట్టటం కేవలం 45 నిమిషాల్లో బిడ్డ పుట్టేయటం జరిగిపోయాయి.
ఏ మహిళకైనా గర్భం వచ్చినప్పుడు రుతుస్రావం ఆగిపోతుంది. ఎమ్మలూయిజ్‌కు కూడా అలాగే జరిగింది. కానీ కొన్ని అనారోగ్యాలకారణాలతో ఆమె వాడే ట్యాబ్లెట్ల వల్ల జరిగి ఉండవచ్చని అనుకుంది. ఈ క్రమంలో బరువు కూడా పెరగడంతో ఎమ్మలూయిజ్ అమ్మమ్మతో కలిసి వాకింగ్ చేసేది. ఈ క్రమంలో నెలలు నిండాయనీ..ఇలా ఆమెకు తెలియకుండానే ఆమె గర్భం ఎలా దాల్చిందని డాక్టర్స్ చెప్పారు. గర్భంలో పెరిగిన బిడ్డ నడుముకు కింది భాగంలో పెరగడం వల్ల ఆమె కడుపు పైకి కనిపించలేదని..అలా 8 నెలలపాటు అలాగే డెలివరీ అయ్యే సమయం వచ్చిన సమయంలో బిడ్డ కదలికలు వేగంగా ఉండటం డెలివరీకి అనుగుణంగా ఉదయానికల్లా కడుపు కనిపించటం..బిడ్డ పుట్టటం జరిగిందని డాక్టర్లు అమ్మమ్మ లూయిజ్ కు చెప్పారు.
కాగా ఈ ఘటన 2018 జులై 17న జరిగినా ఈ అరుదైన కేసు వివరాలను ‘డైలీ మెయిల్’ మాగజైన్ గురువారం (ఏప్రిల్ 5)న వెల్లడించడంతో వైరల్‌గా మారింది. ఏది ఏమైనా.. కడుపులో బిడ్డ పెరుగుతోందనే విషయం తెలియకుండానే సాధారణ జీవితం గడిపేసిన ఆమె.. అకస్మాత్తుగా రెండో బిడ్డకు జన్మనివ్వడం చిత్రమే కాక మరేమిటి..అందుకే రాత్రికి రాత్రే గర్భం..45 నిమిషాల్లోనే బిడ్డ ప్రసవం.
Read Also : వింత కుక్క : ‘తలలో మరో నోరు’