Hajj Pilgrimage Limit : విదేశీయులకు నో ఎంట్రీ.. హజ్‌ యాత్రకు 60వేల మందికే అవకాశం!

హ‌జ్ యాత్ర వ‌చ్చే నెలలో మొదలు కానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రకు విదేశీయులకు నో ఎంట్రీ అంటోంది సౌదీ అరేబియా. స్వదేశీ పౌరులు, నివాసితులకు మాత్రమే వార్షిక హజ్ తీర్థయాత్రను పరిమితం చేసింది.

Hajj Pilgrimage Limit : విదేశీయులకు నో ఎంట్రీ.. హజ్‌ యాత్రకు 60వేల మందికే అవకాశం!

Hajj Pilgrimage Limit

Updated On : June 12, 2021 / 10:07 PM IST

Hajj Pilgrimage Limit : హ‌జ్ యాత్ర వ‌చ్చే నెలలో మొదలు కానుంది. COVID-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రకు విదేశీయులకు నో ఎంట్రీ అంటోంది సౌదీ అరేబియా. స్వదేశీ పౌరులు, నివాసితులకు మాత్రమే వార్షిక హజ్ తీర్థయాత్రను పరిమితం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) నివేదించింది. ఈ ఏడాది హ‌జ్ యాత్ర‌కు 60 వేల మందికి మాత్ర‌మే అనుమతి ఉందని వెల్లడించింది.

కరోనా టీకాలు తీసుకున్నవారు, రోగనిరోధక శక్తి కలిగిన దీర్ఘకాలిక వ్యాధులు లేని 18ఏళ్ల నుంచి 65ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే హజ్ యాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఉందని పేర్కొంది. మక్కాకు ముస్లిం తీర్థయాత్రను నిర్వహించే మంత్రిత్వ శాఖ SPA నిర్వహించిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాదిలో గరిష్టంగా 60వేల మంది పాల్గొనేందుకు అనుమతి కల్పించింది. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ అధిక సంఖ్యలో కరోనా కేసులను నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచే వచ్చేవారిలో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని సౌదీ అరేబియా పరిమితులు విధించాల్సి వచ్చిందని అల్-రబియా చెప్పారు.

కరోనా వ్యాప్తికి ముందు ప్రతి ఏటా సుమారు 2.5 మిలియన్ల మంది మక్కా, మదీనాను వారం రోజులు సందర్శించే వారు. ఈసారి కరోనా దృష్ట్యా సౌదీలో నివసించే వారికి మాత్రమే హజ్ యాత్రను పరిమితం చేయనున్నట్టు సౌదీ ఎస్‌పీఏ నివేదించింది.