X removes : ఎక్స్ సంచలన నిర్ణయం…వందలాది హమాస్ ఉగ్రవాదుల ఖాతాల తొలగింపు

ఉగ్రవాద గ్రూపుల విషయంలో ఎక్స్ సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌పై ఇటీవల హమాస్ దాడుల తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్‌గా పిలిచేవారు) లో ఉగ్రవాద సంస్థలకు చోటు లేదు అని పేర్కొంటూ వందలాది హమాస్ అనుబంధ ఖాతాలను తొలగించింది....

X removes : ఎక్స్ సంచలన నిర్ణయం…వందలాది హమాస్ ఉగ్రవాదుల ఖాతాల తొలగింపు

X CEO Linda Yaccarino

X removes : ఉగ్రవాద గ్రూపుల విషయంలో ఎక్స్ సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌పై ఇటీవల హమాస్ దాడుల తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్‌గా పిలిచేవారు) లో ఉగ్రవాద సంస్థలకు చోటు లేదు అని పేర్కొంటూ వందలాది హమాస్ అనుబంధ ఖాతాలను తొలగించింది. ఉగ్రవాద సంస్థలు, హింసాత్మక తీవ్రవాద సమూహాలకు ఎక్స్ లో స్థానం లేదని, అందుకే వారి ఖాతాలను తొలగించామని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ సీఈఓ లిండా యాకారినో చెప్పారు.

Also Read :Neeraj Chopra : ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్‌ రేసులో నీరజ్ చోప్రా

ఎక్స్ సోషల్ మీడియాలో చట్టవిరుద్ధమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని ఇవ్వడంపై యూరోపియన్ యూనియన్ ఎలాన్ మస్క్ కు అల్టిమేటం జారీ చేసింది. ఎక్స్, మెటాస్ ఫేస్ బుక్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి, ప్రజా భద్రతకు మరింత క్రియాశీల చర్యలు తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడి తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యాపించిన తప్పుడు సమాచారాన్నితొలగించడానికి కంపెనీకి 24 గంటల సమయం ఇచ్చింది.

Also Read :Operation Ajay : ఆపరేషన్ అజయ్ ప్రారంభం…ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన మొదటి విమానం

అక్టోబర్ 7 వతేదీన హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో మరణించిన వారి సంఖ్య 1,300 కి పెరిగింది. మరో 3,300 మంది గాయపడ్డారని హిబ్రూ మీడియా నివేదిక వెల్లడించింది. హమాస్ దాడి సమయంలో 150 మంది అపహరించి, వారిని గాజా స్ట్రిప్‌కు తీసుకెళ్లారు. వారి భవితవ్యం ఇంకా అస్పష్టంగా ఉందని నివేదిక పేర్కొంది.