Public Executions ..afghan Talibans
Public Executions ..Afghan Talibans : అరాచకాలకు పాల్పడే తాలిబన్లు న్యాయస్థానాలకు విలువ ఇస్తారా? గతంతో తమకు శిక్షలు విధించిన మహిళా జడ్జీలు అంతమొందించటానికి వారు ఎక్కుడున్నారో గాలిస్తున్న తాలిబన్లకు కోర్టులంటే గౌరవం ఉంటుందని నమ్మగలమా? కానీ తాము కోర్టుల ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న మాటల్లో ఎంతవరకు నిజమో సందేహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాలిబన్లు బహిరంగ శిక్షల్ని అమలు చేయటానికి అఫ్ఘానిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారట. అసలు అటువంటి శిక్షలు అమలు చేయవచ్చని ధర్మాసనం చెబుతుందా? మరి ఎందుకు తాలిబన్లు ఇలా అంటున్నారు? సుప్రీంకోర్టు నుంచి ఉత్వర్వులు వచ్చాకే తాము బహింరంగ మరణశిక్షల్ని అమలు చేస్తామని అంటున్నారు.
సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణ శిక్షలు, మృతదేహాలను బహిరంగంగా వేలాడదీయడం అమలు చేయాలని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. అందుకు మంత్రి మండలి మొత్తం ఆమోదం తెలిపిందన్నారు. శిక్ష విధిస్తే తప్పనిసరిగా అతడు చేసిన నేరమేంటో ప్రజలకు తెలిసేలా చేయాలని చెప్పారు. కాగా అఫ్ఘానిస్థాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నాక..తాము గతంలో అవలంభించినవిధానాలకు అమలు చేస్తున్నారు. తమకు ఎదురు తిరిగిన వారిని..వ్యతిరేకంగా ఉన్నవారిని తమను ప్రశ్నించినవారిని అత్యంత దారుణంగా అంతమొందిస్తున్నారు. అదీ బహిరంగంగా.అదే వారి అరాచకాలకు పరాకాష్ట.
Read more : Afghan crisis : తాలిబన్ టెర్రర్..అజ్ఞాతంలోకి అఫ్ఘానిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు..
జనానికి బహిరంగ శిక్షలు వేస్తూ తాలిబన్లు తెగబడుతున్న క్రమంలో తాలిబన్లు బహిరంగ మరణ శిక్షలపై ఓ ప్రకటన చేశారు. దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు బహిరంగ శిక్షలు (నరికివేతలు, ఉరితీతలు) అమలు చేయబోమని తెలిపారు. కాళ్లూచేతుల నరికివేత, ఉరితీత వంటి కఠినమైన శిక్షలను బహిరంగంగా అమలు చేస్తామని గతంలో ఆఫ్ఘనిస్థాన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ తురాబీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా దానిపై ఆందోళన వ్యక్తం చేసినా.. తాము ఎలాంటి శిక్షలు వేయాలో వేరే దేశాలు చెప్పాల్సిన పని లేదంటూ నూరుద్దీన్ అమెరికాపై ఫైర్ అయ్యారు. మరి న్యాయస్థానాలు తాలిబన్లకు బహిరంగ శిక్షలు విధించుకోవచ్చని చెబుతుందా? దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇస్తుందా? నిజంగా న్యాయస్థానాలు ఇటువంటి హింసాత్మకమైన చర్యలకు అనుమతులను ఇస్తాయా? లేదా అప్ఘాన్ అంతా ఇప్పుడు తాలిబన్ల చేతిలో ఉందికాబట్టి మరి వారికి అనుగుణంగా ఉత్తర్వులు వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది.