New Spy Satellite : కొత్త గూఢచారి ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్ ఫొటోలు తీసింది…ఉత్తర కొరియా సంచలన ప్రకటన

కొత్త గూఢచారి ఉపగ్రహం గురించి ఉత్తర కొరియా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉత్తర కొరియా ఈ నెలలో కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కొత్త గూఢచారి ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్,యూఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలను తీసింది....

New Spy Satellite : కొత్త గూఢచారి ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్ ఫొటోలు తీసింది…ఉత్తర కొరియా సంచలన ప్రకటన

North Korea Kim Jong Un

Updated On : November 28, 2023 / 9:32 AM IST

New Spy Satellite : కొత్త గూఢచారి ఉపగ్రహం గురించి ఉత్తర కొరియా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉత్తర కొరియా ఈ నెలలో కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కొత్త గూఢచారి ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్,యూఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలను తీసింది. ఉత్తర కొరియా గత వారం అంతరిక్షంలోకి ప్రయోగించిన తన నిఘా ప్రోబ్‌ని ఉపయోగించి ఫోటోలు తీసినట్లు నార్త్ కొరియా ప్రకటించింది.

ALSO READ : Telangana Assembly Election 2023 : పోటాపోటీగా ఓటరు స్లిప్పుల పంపిణీ…ఇంటింటికి కార్యకర్తల బృందాలు

రోమ్, గువామ్‌లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్, పెరల్ హార్బర్, యూఎస్ నేవీకి చెందిన కార్ల్ విన్సన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఫోటోలతో పాటు తాజా చిత్రాలను కిమ్ జోంగ్ ఉన్ చూశారని నార్త్ కొరియా రాష్ట్ర అధికారిక మీడియా తెలిపింది.