Round Egg : బిలియన్లలో ఒకటి ఈ ‘రౌండ్ ఎగ్’.. ధరెంతో తెలుసా?.. జస్ట్ రూ.1,14,954 అంతే..
కోడి గుడ్డు గుండ్రంగానే ఉంటుంది. అయితే పూర్తిగా గుండ్రంగా ఉన్న గుడ్డును చూసారా? బిలియన్ల గుడ్లలో ఒకటి అలా రౌండ్‌గా ఉంటుందిట.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ షేర్ చేసిన రౌండ్ ఎగ్ వీడియో వైరల్ అవుతోంది.

Round Egg
Round Egg : ఎగ్‌ని చాలామంది ఇష్టపడతారు. రెగ్యులర్‌గా అందరూ తినే ఎగ్ మరీ అంత రౌండ్‌గా ఉండదు. పూర్తిగా గుండ్రంగా ఉండే ఎగ్ బిలియన్లలో ఒకటి ఉంటుందట.. అలాంటి గుడ్డును ఆస్ట్రేలియన్ మహిళ చూపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Weight : కోడి గుడ్డు తిన్నా బరువు తగ్గొచ్చు…
జాక్వెలిన్ ఫెల్గేట్ అనే ఆస్ట్రేలియన్ మహిళకు బిలియన్లలో ఒకటైన రౌండ్ ఎగ్‌ని దక్కించుకునే అదృష్టం దొరికింది. ఆ గుడ్డును ఆమె స్నేహితులు పంపారట.. ఇక ఆమె దానిని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో jacquifelgate షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ‘ఈ గుడ్డుని నా స్నేహితులు పంపారు. బిలియన్ల గుడ్లలో 1 గుండ్రంగా ఉంటాయని గూగుల్ గుర్తించింది.. బెండ్ వూలీస్ ప్రాంతంలో మత్స్యకారుల వద్ద కొన్న ఈ గుడ్డు ధర అక్షరాల $1400 (ఇండియన్ కరెన్సీలో రూ.1,14,954) కంటే ఎక్కువ ధరకి కొనుగోలు చేశారు’ అనే శీర్షికతో ఆమె పోస్ట్ చేసింది.
Chicken or Egg?: కోడి ముందా? గుడ్డు ముందా? సైంటిస్ట్‌లు సమాధానం కనిపెట్టేశారు
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘$1400కి గుడ్లు కొంటున్నారా? అది ఎగ్‌టార్షన్’ అని ఒకరు.. ‘మీరు దీనిని తినాలనుకుంటున్నారా? అమ్మాలనుకుంటున్నారా?’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. మొత్తానికి ఈ రౌండ్ ఎగ్ వైరల్ అవుతోంది.
View this post on Instagram