Chicken or Egg?: కోడి ముందా? గుడ్డు ముందా? సైంటిస్ట్‌లు సమాధానం కనిపెట్టేశారు

'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్ క్వశ్చన్.. బహుశా ఇది అత్యధికంగా అడిగే రెండవ ప్రశ్న.

Chicken or Egg?: కోడి ముందా? గుడ్డు ముందా? సైంటిస్ట్‌లు సమాధానం కనిపెట్టేశారు

Chicken Egg

Chicken or Egg?: ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్ క్వశ్చన్.. బహుశా ఇది అత్యధికంగా అడిగే రెండవ ప్రశ్న. మొదటి స్థానంలో మాత్రం ఎవర్ గ్రీన్.. ‘కోడి ముందా? గుడ్డు ముందా?’ అనేదే ప్రశ్న. దీనికి సమాధానం ఇప్పటికీ లేదు. ‘బాహుబలి’ సినిమా రెండో భాగంలోనే జనాలకు ఎప్పుడో సమాధానం దొరికింది. ఇప్పుడు కోడి ముందు వచ్చిందా గుడ్డు వచ్చిందా? అనేదానికి సమాధానం కనిపెట్టారు సైంటిస్ట్‌లు.

ఈ ప్రశ్నకు సమాధానం కూడా సులభం కాదు.. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం సామాన్యుడి దగ్గర కాదు, సైన్స్ దగ్గర ఉంది. సైన్స్ లేటెస్ట్‌గా ఈ విషయాన్ని కనిపెట్టింది. ముందు గుడ్డే పుట్టిందంట.. వందల ఏళ్ల క్రితం భూమ్మీద కోడిని పోలిన భారీ ప‌క్షులు ఉండేవ‌ట‌. ఆ ప‌క్షులు పెట్టిన గుడ్డు నుంచి కోడి లాంటి కొత్త జాతి వచ్చిందని చెబుతున్నారు సైంటిస్ట్‌లు.

అయితే, అవి రాను.. రాను.. జ‌న్యు మార్పిడి చోటు చేసుకొని కోళ్లుగా తయారయ్యాయి‌. తరాలు మారిన తర్వాత.. జ‌న్యు మార్పిడి వ‌ల్లే కోళ్లు తయారయ్యాయని, గుడ్డే ముందు పుట్టిందని సైంటిస్టులు ఓ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.

పరిశోధన ప్రకారం.. కోడి గుడ్లను తయారు చేయడానికి OV-17 అనే ప్రోటీన్ అవసరం, ఇది కోడి అండాశయాలలో మాత్రమే ఉంటుంది. అంటే గుడ్ల ఉత్పత్తికి ఈ ప్రొటీన్ తప్పనిసరిగా అవసరమని అర్థం. అంటే గుడ్డు లేకుండా పిల్ల పుట్టే పనే లేదు.. కాబట్టి గుడ్డే ముందు పుట్టిందని తేల్చేశారు.

Counting: నెల్లూరు కార్పొరేషన్‌, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

రెండు జీవులు పునరుత్పత్తి జరిగినప్పుడు, రెండింటి DNA వారి పుట్టబోయే బిడ్డలో ఉంటుంది, కానీ అది 100% ఒకేలా ఉండదు. ఇటువంటి ఉత్పరివర్తనలు కొత్త జాతి పుట్టుకకు దారితీస్తాయి. ఈ మ్యుటేషన్ గుడ్డు లోపల ఉన్న కణంలో సంభవిస్తుంది. అంటే లక్షల సంవత్సరాల క్రితం కోడి లాంటి జంతువు, ప్రోటో టైప్ చికెన్ అని, మరో ప్రోటో టైప్ కోడితో జతకట్టి, ఆ తర్వాత జెనెటిక్ మ్యుటేషన్ తర్వాత అలాంటి గుడ్డు ప్రపంచంలోకి వచ్చిందని చెబుతున్నారు.

Kuppam: కుప్పం కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ప్రత్యేక అధికారిని నియమించిన హైకోర్టు