Myanmar COVID: మయన్మార్​లో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం!

మన దేశంలో ప్రస్తుతం కరోనా రెండవ దశ చాలా అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తుంది. అయితే.. రెండవదశ ఉదృతిగా ఉన్న సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య ప్రజలను భయకంపితులను చేసిన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ అందక.. ఆసుపత్రులలో బెడ్స్ సరిపోక.. మందుల కొరత ఏకమై మన దేశంలో ప్రజలను కంగారుపెట్టేసింది.

Myanmar COVID: మన దేశంలో ప్రస్తుతం కరోనా రెండవ దశ చాలా అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తుంది. అయితే.. రెండవదశ ఉదృతిగా ఉన్న సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య ప్రజలను భయకంపితులను చేసిన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ అందక.. ఆసుపత్రులలో బెడ్స్ సరిపోక.. మందుల కొరత ఏకమై మన దేశంలో ప్రజలను కంగారుపెట్టేసింది. అయితే.. ఇప్పుడు అంతకు రెట్టింపు కరోనా కేసులు, మరణాల రేటుతో మయన్మార్ శవాల దిబ్బగా మారుతుంది. ఇక్కడ వైద్య రంగం అస్తవ్యస్థం కావడంతో మరణాల రేటు అధికంగా నమోదవుతుంది.

ప్రస్తుతం మయన్మార్ లో పది లక్షల జనాభాకు ఏడు రోజుల తలసరి మరణాల సంఖ్య 6.29గా ఉంది. అంటే ఇది మే నెలలో భారత్​లో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటి సంఖ్యతో పోలిస్తే ఇది రెట్టింపు అనమాట. అప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితులే దారుణం అనుకుంటే ఇప్పుడు మయన్మార్ పరిస్థితి అంచనాకు అందడం లేదు. దీన్ని బట్టి ఆ దేశంలో కరోనా ఏ స్థాయిలో మరణ మృదంగం మోగిస్తోందనే విషయం అర్థమవుతోంది. బలహీన వైద్య వ్యవస్థ కారణంగానే ఈ స్థాయిలో ఇక్కడ మరణాలు నమోదవుతున్నాయి.

మయన్మార్​లో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొనగా మిలిటరీ ప్రభుత్వం ప్రజల నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రభుత్వం ఇక్కడ కరోనాను జీవాయుధంగా పరిగణిస్తోందని మేధావులు అభిప్రాయపడుతుండగా.. అదే సమయంలో నిరసనలో పాల్గొన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై సైన్యం దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే వైద్య వృత్తిలో ఉన్న అనేక మందిపై వారెంట్లు జారీ చేయగా ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మయన్మార్​లో 40 శాతం మాత్రమే వైద్య సేవల కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం మయన్మార్​లో కరోనా సంక్షోభ స్థాయికి చేరిపోగా రెండు వారాల్లోనే దేశంలోని సగం జనాభాకు వైరస్ సోకుతుందని అంచనా వేస్తున్నారు. మయన్మార్ జనాభా 5.4 కోట్లు కాగా.. మరో రెండు వారాల్లో 2.7 కోట్ల మందికి వైరస్ సోకుతుందని అంచనా వేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలోని బ్రిటన్ రాయబారి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీచేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాగా, దీన్ని ఒక్క మయన్మార్ విపత్తుగా కాకుండా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేయాలని పలు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు