Death Predictor :ఎప్పుడు చనిపోతామో తెలుసుకోవచ్చట..మరణం గురించి చెప్పే క్యాలుకులేటర్

వాన రాకడ..ప్రాణం పోకడ తెలీదని పెద్దలు అంటుంటారు. కానీ టెక్నాలజీ వాన రాకడ గురించి చెబుతోంది. మరి ప్రాణం ఎప్పుడు పోతుంది తెలుస్తుందా? అదికూడా చెప్పేయవచ్చు అంటున్నారు సైంటిస్టులు. ఎప్పుడు చనిపోతారో తెలుసుకునే క్యాలుకులేటర్​ను తయారు చేశారు కెనడా శాస్త్రవేత్తలు.

Death Predictor :ఎప్పుడు చనిపోతామో తెలుసుకోవచ్చట..మరణం గురించి చెప్పే క్యాలుకులేటర్

Death Predictor (1)

Updated On : July 9, 2021 / 6:12 PM IST

Canadian scientists discover Death Predictor : వాన రాకడ..ప్రాణం పోకడ తెలీదని పెద్దలు అంటుంటారు. కానీ టెక్నాలజీ నేడు వాన రాకడ గురించి తెలుస్తోంది. మరి ప్రాణం ఎప్పుడు పోతుంది తెలుస్తుందా? అంటే కాస్త ఆలోచిస్తాం. ఆయా వ్యక్తులు ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా వారు ఎప్పుడు చనిపోతారో చెప్పటం సాధ్యం కాదు. సుదీర్ఘకాలంలో వ్యాధులతో బాధపడేవారు సంవత్సరాల తరబడి జీవించవచ్చు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా సడెన్ గా ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ వయో వృద్ధులు ఎప్పుడు చనిపోతారో చెప్పగలమా? కానీ ఇప్పుడు అదికూడా సాధ్యమే నంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు.

కానీ ఎప్పుడు చనిపోతామో తెలుసుకోవటానికి కెనడా శాస్త్రవేత్తలు ఓ ఆన్​లైన్​ క్యాలుకులేటర్​ను రూపొందించారు. ఇది వయో వృద్ధుల కోసం కనిపెట్టిన క్యాలుకులేటర్. ఇది వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పేస్తుంది. అంతేకాదు వారి రోజువారి అలవాట్లు అంటే వారు తినే ఆహారం..,చేసే వ్యాయామం మట్టి వారిలో ఎంత సామర్థ్యంతో ఉన్నారో వంటి పలు వివరాలు క్యాలుకులేటర్​లో ఒక్కసారి నమోదు చేస్తే చాలు వారి మరణాన్ని అంచనా వేస్తుంది ఈ క్యాలుకులేటర్​…!! చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ…

కెనడా శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ ఆన్​లైన్​ క్యాలుకులేటర్​ను రిస్క్ ఎవాల్యూషన్ ఫర్ సపోర్ట్​ : ప్రొటెక్షన్ ఫర్ ఎల్డర్ లైఫ్ ఇన్ ది కమ్యూనిటీ టూల్ (RESPECT) టూల్​ను వారు దీన్ని వయో వృద్ధుల కోసం కనుగొన్నారు. ఆయా వయో వృద్ధుల మరణం గురించి ముందే తెలిస్తే..వారి చివరి రోజుల్లో వారి కుటుంబంతోను..ఆత్మీయులతోను సంతోషంగా గడిపే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ క్యాలుకులేటర్​ను రూపొందించినట్టు కెనడా శాస్త్రవేత్తల బృందం తెలిపింది.ఈ క్యాలుకులేటర్ ఆరు నెల్లో మరణాన్ని అంచనా వేస్తుంది. 2007 నుంచి 2013 మధ్య ఒంటారియోలో మృతి చెందిన 4,91,000 మందికిపైగా వృద్ధుల చివరి ఆరు నెలల పరిస్థితులు, స్థితిగతుల ఆధారంగా ఆ రెస్పెక్ట్​ క్యాలుకులేటర్ అంచనా వేసింది. వయో వృద్ధులు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితితో పాటు వారి రోజువారి అలవాట్లు, ఎంత సామర్థ్యంతో ఉన్నారో తదితర వివరాలు క్యాలుకులేటర్​లో ఒక్కసారి నమోదు చేయగానే మరణాన్ని అంచనా వేస్తుంది. దానికి ఇచ్చిన డేటా ఆధారంగా అంచనావేసి ఫలితాలను వెల్లడిస్తుంది.

“కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో చివరి రోజుల్లో ఆనందంగా గడిపేలా రెస్పెక్ట్​ క్యాలుకులేటర్ సహకరిస్తుంది” అని బ్రుయెరె రిసెర్చ్ ఇన్​స్టిట్యూట్​ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ యామీ షూ తెలిపారు. “ఉదాహరణకు, ఒకవేళ పేరెంట్ మరణించనున్నారని తెలిస్తే పిల్లలు సెలవులు పెట్టి వారితోనే ఎక్కువ సమయం గడపవచ్చు. అలాగే ఏదైనా చేయాలనుకున్న పని మిగిలి ఉంటే చేయవచ్చు. యాత్రలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు” అని ఆ డాక్టర్ వెల్లడించారు.రెస్పెక్ట్ క్యాలుకులేటర్ కోసం వయోవృద్ధులు కొన్ని వివరాలు దీనికి సమర్పించాలి. అంటు గతంలో వారు హార్ట్ స్ట్రోక్​ లాంటి వ్యాధులకు చికిత్స తీసుకున్నారా. డెమెంటయా ఉందా? హైపర్​టెన్షన్? గడిచిన మూడు నెలల నుంచి రోజువారి కార్యకలాపాలు, కాలకృత్యాలు వంటివి సక్రమంగా చేస్తున్నారా? లేదా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? అనే పలు వివరాలు ఈ క్యాలుకులేటర్ కు ఇవ్వాలి.

అలాగే వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, హఠాత్తుగా బరువు తగ్గడం, పెరగటం బాడీలో డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు ఉన్నాయా? అనే అన్న వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత గత డేటా ఆధారంగా వృద్ధులు ఎప్పుడు మరణిస్తారోనని రెస్పెక్ట్ క్యాలుకులేటర్ అంచనా వేసి ఫలితాన్ని వెల్లడిస్తుంది. మరణం దగ్గర పడినప్పుడు ఆయా వయో వృద్ధుల్లో చాలా మార్పులు వస్తాయని..వీటి ఆధారంగా వారు ఎప్పుడు చనిపోతారో అంచనా వేయవచ్చని క్యాలుకులేటర్ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.