Osama bin Laden: అఫ్ఘాన్ తాలిబాన్లతో లాడెన్ కొడుకు చర్చలు

విదేశీ ఉగ్రవాద గ్రూపులైన ఆల్ ఖైదా, ఐఎంయూలు ఇటీవలి కాలంలో అఫ్ఘానిస్తాన్ వేదికగా యథేచ్ఛగా తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ కొడుకు అక్టోబరు నెలలో తాలిబాన్లతో చర్చలు జరిపి

Osama bin Laden: అఫ్ఘాన్ తాలిబాన్లతో లాడెన్ కొడుకు చర్చలు

Afghanistan

Updated On : February 5, 2022 / 7:01 PM IST

Osama bin Laden: విదేశీ ఉగ్రవాద గ్రూపులైన ఆల్ ఖైదా, ఐఎంయూలు ఇటీవలి కాలంలో అఫ్ఘానిస్తాన్ వేదికగా యథేచ్ఛగా తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ కొడుకు అక్టోబరు నెలలో తాలిబాన్లతో చర్చలు జరిపినట్లు చెబుతుంది యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్.

ఇస్లామిక్ స్టేట్, ఆల్ ఖైదా అనుబంధ సంస్థల కార్యకలాపాలపై ఇచ్చిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. వారు చెప్పినట్లుగా ఏ అంశంలోనూ కట్టుబడి ఉండలేదంటూ అందులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కాబూల్ కేంద్రంగా బలపడుతున్నారంటూ వివరించారు.

‘ఆగస్టు 15న అఫ్ఘానిస్తాన్ ను తాలిబాన్లు ఆధీనంలోకి తీసుకున్నప్పుడు అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దేశంలో విదేశీ ఉగ్రవాద యోధుల కార్యకలాపాలను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు’ అని నివేదిక పేర్కొంది.

Read Also: “గోప్రో కెమెరా”ను దొంగిలించి ఎగిరిపోయిన చిలుక

‘బిన్ లాడెన్ కొడుకు అబ్దుల్లా తాలిబాన్‌తో సమావేశాల కోసం అక్టోబర్‌లో అఫ్ఘానిస్తాన్‌ను సందర్శించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత అల్-ఖైదా చీఫ్ ఇమాన్ అల్-జవహిరి సజీవంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. సభ్య దేశాలు మాత్రం అతని ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది.

హతమైన అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు సెక్యూరిటీ కో ఆర్డినేట్ చేసిన అమీన్ ముహమ్మద్ ఉల్-హక్ సామ్ ఖాన్ కూడా ఆగస్టు చివరిలో అఫ్ఘానిస్తాన్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు.

ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, పాకిస్థాన్ దేశాలకు చెందిన 200 నుంచి 400 వరకు యుద్ధ విమానాలు ఆల్ ఖైదా వద్ద ఉన్నట్లు అంచనా.