Drone Attack : సిరియన్ మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి…100 మందికి పైగా మృతి, 125 మందికి గాయాలు
సిరియాలో మరోసారి ఉగ్రవాదులు భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు....

Drone Attack
Drone Attack : సిరియాలో మరోసారి ఉగ్రవాదులు భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోంస్‌లో డ్రోన్ దాడులకు ఉగ్రవాద సంస్థలు కారణమని సమాచారం. యుద్ధంలో దెబ్బతిన్న కుర్దిష్-ఆధీనంలోని ఈశాన్య ప్రాంతంలో టర్కీ వైమానిక దాడులు జరిగాయి. ఈ వైమానిక దాడుల్లో 9 మంది హతం అయ్యారు. మరణించిన వారిలో సగం మంది సైనిక గ్రాడ్యుయేట్లు అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది.
CM Jagan : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్
పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లతో దాడి చేశారు. వీరి మృతికి సంతాప సూచకంగా సిరియా ప్రభుత్వం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. వాయువ్య ప్రతిపక్ష బురుజులోని పలు పట్టణాలపై జరిగిన దాడిలో నలుగురు పౌరులు మరణించారు. జిహాదీ గ్రూపు గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై డ్రోన్‌లతో దాడులు చేసింది.
Nara Lokesh : ఢిల్లీ నుంచి అమరావతి చేరుకున్న నారా లోకేశ్.. రేపు చంద్రబాబుతో ములాఖత్
సిరియా ఈశాన్య ప్రాంతంలో టర్కీ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఖహ్తానియేహ్ సమీపంలోని చమురు ప్రదేశాల నుంచి నల్లటి పొగలు పైకి కనిపించాయి. ఆ ప్రాంతంలోని రెండు పవర్ స్టేషన్లు, అలాగే ఒక డ్యామ్ పరిసర ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ దాడి తరువాత ఈశాన్య సిరియాలోని కుర్దిష్ యోధులపై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ హెచ్చరించారు.