బెగ్గింగ్ మాఫియాలోనే కాదు క్రైమ్ లో కూడా.. ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో 23వేల మందికి పైగా పాకిస్థానీలు

దొంగతనాలు, హత్యలు, మాదకద్రవ్యాల రవాణ, మనీలాండరింగ్, లైంగిక దాడులు, ఆర్థిక మోసాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే..

బెగ్గింగ్ మాఫియాలోనే కాదు క్రైమ్ లో కూడా.. ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో 23వేల మందికి పైగా పాకిస్థానీలు

Updated On : May 20, 2025 / 10:30 AM IST

Pakistanis In Jail: పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయ అసెంబ్లీలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. పాకిస్తాన్ కు చెందిన 23వేల మందికి పైగా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని జైళ్లలో ఉన్నారని తెలిపింది. వారంతా పలు నేరాలకు పాల్పడ్డారని వెల్లడించింది. ప్రస్తుతం విదేశాల్లో 23వేల 456 మంది పాకిస్తానీయులు జైలు శిక్ష అనుభవిస్తున్నారని, వీరిలో అత్యధిక సంఖ్యలో 12వేల 156 మంది సౌదీ అరేబియాలోనే ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి తెలియజేసింది.

దిగువ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రకటన చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ అత్యధిక సంఖ్యలో పాకిస్తానీ ఖైదీలను కలిగి ఉంది. అక్కడి జైళ్లలో 5వేల 292 మంది పాక్ వాసులు ఉన్నారు. చైనాలో 400 మంది జైలు పాలైన వారిలో ఉన్నారు. ఎక్కువ మంది మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక దాడి, దోపిడీ, హత్యలు, నకిలీ కరెన్సీ కేసుల్లో దోషులుగా ఉన్నారు.

బహ్రెయిన్‌లో జైలులో 450 మంది పాకిస్తానీలు ఉన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాలను కలిగి ఉండటం, మోసం చేసినందుకు దోషులుగా నిర్ధారించబడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లో 88 మంది పాకిస్తానీలు కటకటాల పాలయ్యారు. వారిలో ఎక్కువగా భద్రతా సంబంధ నేరాలకు పాల్పడ్డారు.

పశ్చిమాసియాలోని ఇతర దేశాలలో పాకిస్తానీల ట్రాక్ రికార్డ్ పేలవంగా ఉంది, ఖతార్‌లో 338 మంది పాకిస్తానీలకు జైలు శిక్ష పడింది. దొంగతనం, హత్య, మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్, లైంగిక దాడి, ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. ఒమన్ లో 309 పాక్ వాసులు కారాగారంలో ఉన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్య, దోపిడీ, లైంగిక వేధింపుల కేసుల్లో వారంతా అరెస్ట్ అయ్యారు. ఇక మలేషియాలోని జైళ్లలో 255 మంది పాక్ పౌరులు బందీలుగా ఉన్నారు.

Also Read: ఆసియాలో మళ్లీ కోవిడ్ కలకలం.. టెన్షన్ పెడుతున్న JN.1 వేరియంట్.. లక్షణాలు ఏవి, ముందు జాగ్రత్తలు ఏంటి..

యూరోపియన్ దేశాల విషయానికి వస్తే.. ఆస్ట్రియాలో పలు నేరాలు చేసి పాకిస్తానీలు పట్టుబడ్డారు. లైంగిక వేధింపులతో పాటు అక్రమ ప్రవేశం, మానవ – మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్య కేసుల్లో పాకిస్తానీలను దోషులుగా నిర్ధారించబడ్డారు. నార్వేలోనూ పలువురు జైలు పాలయ్యారు. ఫిన్ ల్యాండ్ లో ఇద్దరు కారాగారంలో ఉన్నారు. ఇక ఫ్రాన్స్ లో 168 మంది, జర్మనీలో 94 మంది పాకిస్తానీలు అరెస్ట్ అయ్యారు. కెనడాలో 9 మంది, డెన్మార్క్ లో 27మంది అరెస్ట్ అయ్యారు.

అజర్‌బైజాన్‌లో 16 మంది ఖైదీలలో 11 మందికి హత్య, మానవ-మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ ప్రవేశం వంటి నేరాలకు శిక్ష విధించగా, ఐదుగురు విచారణలో ఉన్నారు. టర్కీలో 147 మంది ఖైదీలు దోషులుగా నిర్ధారించబడ్డారు. 161 మంది మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, లైంగిక దాడి , పిల్లలపై వేధింపులు వంటి వివిధ నేరాలకు సంబంధించి విచారణలో ఉన్నారు.