Pakistan Election Results 2024 : పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు హవా.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు నవాజ్ షరీఫ్ అడుగులు

పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి సందేశాన్ని అందించారు. నాతోటి పాకిస్థానీలు.. మీరు చరిత్ర సృష్టించారు. నేను మీ గురించి గర్వపడుతున్నాను. దేశాన్ని ఏకంచేసినందుకు నేను దువునికి కృతజ్ఞతలు తెలపుతున్నాను అని అన్నారు.

Pakistan Election Results 2024 : పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు హవా.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు నవాజ్ షరీఫ్ అడుగులు

Pakistan Election 2024

Pakistan Election Results : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు కావాలి. కౌంటింగ్ ముగిసే సమయానికి మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. రెండో స్థానంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్) పార్టీ నిలిచింది.

Also Read : Election in Pakistan: ఎన్నో అడ్డంకులు, ఉద్రిక్తల అనంతరం పాకిస్తాన్‭లో ఎన్నికలకు లైన్ క్లియర్.. ఎప్పుడో తెలుసా?

తాజా వివరాల ప్రకారం.. మొత్తం 251 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. పీఐటీ పార్టీ నేత ఇమ్రాన్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన 100 మంది ఇప్పటి వరకు విజయం సాధించారు. పీఎంఎల్ఎన్ పార్టీ అభ్యర్థులు 71 మంది, పీపీపీ అభ్యర్థులు 53 మంది, ఇతరులు 27 మంది విజయం సాధించారు. మరో 14 స్థానాలకు కౌటింగ్ జరుగుతుంది. ఏ పార్టీ అయిన అధికారం చేపట్టాలంటే 133 సీట్లు కావాలి. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నాలు చేస్తున్నారు. హత్యకు గురైన మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో – జర్దారీకి చెందిన పీపీపీని సంకీర్ణ భాగస్వామిగా సంప్రదిస్తానని షరీఫ్ చెప్పారు.

Also Read : Imran Khan Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్‌షాక్‌.. పీటీఐ పార్టీపై ఈసీ నిషేధం?

పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి సందేశాన్నిఆడియో విజువల్ రూపంలో అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖాన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించిన అతని మద్దతుదారులను అభినందించారు. నాతోటి పాకిస్థానీలు.. మీరు చరిత్ర సృష్టించారు. నేను మీ గురించి గర్వపడుతున్నాను. దేశాన్ని ఏకంచేసినందుకు నేను దువునికి కృతజ్ఞతలు తెలపుతున్నాను అని అన్నారు.

 

పాకిస్థాన్ ఎన్నికల్లో ఫలితాలపై అమెరికా స్పందించింది. ఏ పార్టీ ప్రభుత్వంతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని అమెరికా తెలిపింది. మా భాగస్వామ్య ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడానికి మేము రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అమెరికా తెలిపింది. మరోవైపు అమెరికా మహిళా ఎంపీ ఎలిస్సా స్లాట్ కిన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ పై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేసింది.