Pakistan : కూరగాయల దండతో అసెంబ్లీకి వచ్చిన ఎంపీ
ఓ ఎంపీ వినూత్నంగా తన నిరసనను ప్రభుత్వానికి తెలియచేశాడు. కొన్ని కూరగాయలను దండగా వేసుకుని..సైకిల్ పై అసెంబ్లీకి వచ్చారు.

Pak
Pakistan MPA : నిరసనలు, ఆందోళనలు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంటాయి. అధికారపక్షం వైఖరికి విపక్షాలే కాకుండా..రోడ్ల మీదకు వచ్చి…నిరసనలు చేపడుతుంటారు. కొంతమంది వినూత్నంగా నిరసనలు తెలియచేస్తూ…వార్తల్లోకి ఎక్కుతుంటారు. నిరహార దీక్షలు చేస్తూ..విచిత్ర వేషధారణలతో తమ నిరసన వ్యక్తం చేస్తుంటారు. అలాగే.. ఓ ఎంపీ వినూత్నంగా తన నిరసనను ప్రభుత్వానికి తెలియచేశాడు. కూరగాయలు ధరలు పెరగడంతో..ఆ ఎంపీ..కొన్ని కూరగాయలను దండగా వేసుకుని..సైకిల్ పై అసెంబ్లీకి వచ్చారు. ఈ ఘటన పాక్ లో చోటు చేసుకుంది.
Read More : UltimaSMS : గూగుల్ ప్లే స్టోర్‌లో 150 డేంజరస్ యాప్స్ బ్యాన్..!
పాక్ దేశంలో ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో తెలిసేంది. నిత్యాసవర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వినూత్నంగా నిరసన తెలియచేయాలని పాక్ ముస్లిం లీ – ఎన్ (పీఎంఎల్ – ఎన్) ప్రావిన్షియల్ సభ్యులు తారిఖ్ మసీహ్ నిర్ణయించుకున్నారు. ఓ సైకిల్ పైకి ఎక్కి…కూరగాయలతో తయారు చేసిన దండను ధరించారు. అనంతరం ఆ సైకిల పై పాక్ అసెంబ్లీకి వెళ్లారు. ఆ దండలో ఆలుగడ్డలు, టమాటాలు, క్యాప్సికమ్ లు ఉన్నాయి.
Read More : AP Covid – 19 : 381 కరోనా కేసులు..ఒకరు మృతి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తాను అసెంబ్లీకి వచ్చేందుకు సైకిల్ ను ఉపయోగిస్తానని చెప్పారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలను పాక్ ఎదుర్కొంటోందని, దీనికి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లిస్తోందన్నారు. ఈ ద్రవ్యోల్బణం కారణంగా…పేదలే కాకుండ..వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్న వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈయనకు సంబంధించిన ఫొటో..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.