New Year celebration : ఆ దేశంలో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం.. ఎందుకంటే..?

పాకిస్థాన్ దేశం 2024 జనవరి 1వతేదీన కొత్త సంవత్సర వేడుకలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశంలో నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ప్రకటించారు....

Pakistan PM Anwaarul Haq Kakar

New Year celebration : పాకిస్థాన్ దేశం 2024 జనవరి 1వతేదీన కొత్త సంవత్సర వేడుకలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశంలో నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ప్రకటించారు. గాజాలోని ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు తాము నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు అన్వారుల్ హక్ కాకర్ చెప్పారు. దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రధాని అన్వర్ చేసిన ప్రసంగంలో, కొత్త సంవత్సరంలో పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రదర్శించాలని కాకర్ కోరారు.

ALSO READ : రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మ మంత్రివర్గ విస్తరణ

పాలస్తీనాలో తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి సంఘీభావం తెలియజేయడానికి, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించకుండా ప్రభుత్వం కఠినమైన నిషేధాన్ని విధించిందని ఆయన చెప్పారు. అక్టోబర్ 7వతేదీన ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 21వేలమంది పాలస్తీనియన్లు హత్యకు గురయ్యారని, వీరిలో 9వేల మంది పిల్లలున్నారని పాక్ ప్రధాని పేర్కొన్నారు.

ALSO READ : ఢిల్లీలో తీవ్ర చలిగాలులు…ఐఎండీ కోల్డ్ డే హెచ్చరిక

గాజా, వెస్ట్ బ్యాంక్ లో పిల్లల ఊచకోత,నిరాయుధ పాలస్తీనియన్ల మారణహోమంపై ముస్లిం ప్రపంచం వేదనలో ఉందన్నారు. గాజాలో ఆకలికేకల నేపథ్యంలో పాక్ పాలస్తీనాకు రెండు సహాయ ప్యాకేజీలను పంపిందని, మూడవ ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.

ALSO READ : రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆరు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా

పాలస్తీనాకు సకాలంలో సహాయం అందించడానికి, గాజాలో ఉన్న గాయపడిన వారిని తరలించడానికి జోర్డాన్, ఈజిప్ట్‌లతో పాకిస్తాన్ చర్చలు జరుపుతోందని పాక్ ప్రధాని చెప్పారు. వివిధ ప్రపంచ వేదికలపై పాలస్తీనా ప్రజల దుస్థితిని ఎత్తిచూపేందుకు పాకిస్థాన్ ప్రయత్నించిందని, ఇజ్రాయెల్ రక్తపాతాన్ని ఆపేందుకు భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తామని ప్రధాని కాకర్ పేర్కొన్నారు.