Vande Bharat trains : రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆరు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా

దేశంలోని రైల్వే ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త వెల్లడించారు. రామజన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో శనివారం ఆరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపనున్నారు....

Vande Bharat trains : రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆరు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా

Vande Bharat trains

Vande Bharat trains : దేశంలోని రైల్వే ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త వెల్లడించారు. రామజన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో శనివారం ఆరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపనున్నారు. శ్రీమాతా వైష్ణో దేవి కట్రా-న్యూఢిల్లీ, అమృత్ సర్- ఢిల్లీ, కోయంబత్తూర్-బెంగళూర్, మంగళూరు-మడ్ గాం, జాల్నా-ముంబయి, అయోధ్య -ఆనంద్ విహార్ టెర్మినల్ రూట్లలో కొత్తగా వందేభారత్ రైళ్లను ప్రధాని అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

ALSO READ : Earthquake : మణిపూర్ ఉఖ్రూల్‌లో భూకంపం…భయాందోళనల్లో జనం

దీంతోపాటు దర్బంగా-అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్, మాల్దా టౌన్ – బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినస్ వరకు కొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లకు మోదీ పచ్చజెండా ఊపనున్నారు. అయోధ్య నగరంలో రామాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కొత్తగా అయోధ్య ధామ్ జంక్షన్ ను అభివృద్ధి చేశారు.

ALSO READ : Cold day warning : ఢిల్లీలో తీవ్ర చలిగాలులు…ఐఎండీ కోల్డ్ డే హెచ్చరిక

రాముడి జన్మస్థలమైన అయోధ్యలో 11,100 కోట్ల రూపాయలతో పలు పౌర సౌకర్యాలు కల్పించనున్నారు. రూ.2180కోట్లతో గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు రూ.300 కోట్లతో రెసిడెన్షియల్ స్కీంకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. రూ.4600కోట్లతో యూపీలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

ALSO READ : సీఎం రేవంత్ రెడ్డి ముందు బిగ్ ఛాలెంజ్.. పార్లమెంటు ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా?

మూడు-అంతస్తుల అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్, రూమా-చాకేరి-చందారి మూడవ లైన్ ప్రాజెక్ట్, రైలు కనెక్టివిటీని పెంచే ఇతర ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను కొత్తగా రూ.240 కోట్లతో నిర్మించారు. జౌన్‌పూర్-అయోధ్య-బారాబంకి డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా 152 కిలోమీటర్ల పొడవున పూర్తయిన సెక్షన్‌లో కొంత భాగాన్ని ప్రారంభించనున్నారు.