గ్రే లిస్ట్ లో పాకిస్తాన్: భారత్ ప్రయత్నాలు ఫలించేనా?

కశ్మీర్‌లోని పుల్వామా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే యోచనతో భారత్ ఉంది. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య (ఎమ్‌ఎఫ్‌ఎన్) హోదాను భారత్ రద్దు చేసుకుంది. పాకిస్తాన్ నుంచి భారత్‌కు దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 200 శాతం పెంచింది.
మరోవైపు అంతర్జాతీయంగా కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నుంచి పాకిస్తాన్ ను బ్లాక్ చేయించేందుకు భారత్ పావులు కదుపుతుంది. ఈ మేరకు ప్రపంచదేశాలతో భారత్ చర్చలు జరుపుతుంది. అయితే తాజాగా ప్యారిస్ లో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో పాకిస్తాన్ ని ప్రస్తుతం ఉన్న గ్రే లిస్ట్ లోనే కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది.
Read Also: భారత్ చాలా బలంగా ఉంది: పాకిస్తాన్‌కు ట్రంప్ వార్నింగ్
హఫీజ్ సయీద్, మసూద్ అజర్ ల నేతృత్వంలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకొని గ్రే లిస్ట్ నుంచి బయటపడాలని భావించిన పాకిస్తాన్ ప్రయాత్నాలు విఫలం అయ్యాయి. అలాగే బ్లాక్ లిస్ట్ లో చేర్పించాలని భావించిన భారత్ ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. అయితే ఎఫ్ఏటీఎఫ్ నుంచి దక్కిన కొద్దిపాటి ఊరటను పాకిస్తాన్ నిలబెట్టుకునేట్లు కనిపించట్లేదు. పాకిస్తాన్ రేటింగ్ పై జూన్, అక్టోబర్ నెలల్లో మరోసారి సమీక్ష జరగనుంది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకొనేందుకు ఇచ్చిన నిర్ణీత కాలవ్యవధి దాటిపోకుండా చూసుకోవాలని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్ ను హెచ్చరించింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం చేసింది.
ఇచ్చిన కాలవ్యవధిలోపుగానే లక్ష్యం పూర్తి చేయాలని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్ కు చెప్పింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే దేశాలకు ఈ ఎఫ్ఏటీఎఫ్ సంస్థ ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ సంస్థ ఇచ్చే రేటింగ్ ఆధారంగా వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సహా పలు ఆర్థిక సంస్థలు సాయం అందజేస్తారు. ఈ సంస్థలు రేటింగ్ ప్రకారం ఏ దేశానికైనా రుణాలు వస్తాయి. అయితే ఎఫ్ఏటీఎఫ్ లో పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లోకి చేర్పించేందుకు భారత్ చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తుంది.
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు
Read Also: గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్