పాక్ అందుకే తగ్గింది : మిస్సైల్ దాడులకు భయపడే అభినందన్ విడుదల

తమ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యుద్ధానికి కాలు దువ్విన పాకిస్తాన్ సడెన్‌గా ఎందుకు మనసు మార్చుకుంది. అభినందన్‌ను ఎందుకు విడుదల చేయాలనుకుంది. భారత్‌తో శాంతి కోరుకోవడానికి కారణం ఏంటి? భారత పైలెట్ అభినందన్ విడుదల నిర్ణయం వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్ చేయబోయే మిస్సైల్ దాడులకు భయపడే తమ చెరలో ఉన్న అభినందన్‌ను రిలీజ్ చేయడానికి పాకిస్తాన్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Read Also : ఇమ్రాన్ ఖాన్ ప్రశ్న : 19ఏళ్ల యువకుడు మానవబాంబుగా ఎందుకు మారాడు
అభినందన్‌ను పాకిస్తాన్ నిర్భంధించడం భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పాకిస్తాన్‌పై మిస్సైల్ దాడులకు భారత సైన్యం సిద్ధమైంది. నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం అందుకున్న అమెరికా.. వెంటనే పాకిస్తాన్ ప్రధానికి ఫోన్ చేసింది. యుద్ధం అంటూ వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. అభినందన్‌ను రిలీజ్ చేయాలని పాక్ ప్రభుత్వానికి అమెరికా సూచన చేసింది. పాక్ విదేశాంగ మంత్రితో సమావేశమైన సౌదీ విదేశాంగ మంత్రి సైతం.. వింగ్ కమాండర్ అభినందన్‌ని విడుదల చేస్తే భారత్ కొంతవరకు వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెప్పింది. ఇలా అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ ఆలోచనలో పడిపోయింది. చివరికి అభినందన్ విడుదలకు అంగీకారం తెలిపింది.
Read Also:ఇమ్రాన్ ఖాన్ ప్రకటన : రేపే కమాండర్ అభినందన్ విడుదల
రేపు(మార్చి 1 2019) అభినందన్‌ను విడుదల చేస్తామని స్వయంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. పార్లమెంటు వేదికగా శాంతి సందేశం పంపారు. భారత్‌తో శాంతి కోరుకుంటున్నట్టు ఇమ్రాన్ స్పష్టం చేశారు. కాగా, యుద్ధంపై చర్చించేందుకు గురువారం(ఫిబ్రవరి 28) సాయంత్రం త్రివిధ దళాధిపతులు భేటీ కావాల్సి ఉంది. ఇంతలో అభినందన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకారం తెలపడంతో యుద్ధం ఆలోచనలను విరమించుకున్నట్టు తెలుస్తోంది.
Wing Commander Abhinandan to be released tomorrow: Pak PM Imran Khan pic.twitter.com/yBbT7eeN3l
— Jammu Weekly News (@jammuweeklynews) February 28, 2019
Read Also : ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ : సముద్రంలో పెట్రోలింగ్