Pakistan : మత్స్యకారుడిని మిలియనీర్ చేసిన అరుదైన చేప.. ఆ చేప ప్రత్యేకత ఏంటంటే?
పాకిస్తాన్‌లో ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రి మిలియనీర్ అయ్యాడు. సముద్రంలో వేటకు వెళ్లిన అతనికి అరుదైన చేప చిక్కింది. ఆ చేప ప్రత్యేకత ఏంటంటే?

Pakistan
Pakistan : పాకిస్తాన్ మత్స్యకారుడు అరుదైన చేపను పట్టుకుని రాత్రికి రాత్రి లక్షాధికారి అయ్యాడు. ‘క్రోకర్’ అనే అరుదైన చేపను పట్టుకోవడంతో జాక్ పాట్ కొట్టాడు.
Anakapalli : ఆ చేప ఖరీదు రూ.3 లక్షలు.. ప్రత్యేకత ఏంటంటే?
గ్వాదర్ జిల్లాలోని జివానీ తీరానికి సమీపంలో బలూచిస్తాన్‌కు చెందిన వహీద్ బలోచ్ అనే మత్స్యకారుడికి చిక్కిన క్రోకర్ అనే అరుదైన చేప చిక్కింది. ఈ ఒక్క చేప స్ధానిక మార్కెట్‌లో రూ.7.2 మిలియన్లకు అమ్ముడు పోయి వహీద్ ను తక్కువ సమయంలో లక్షాధికారిని చేసింది.
క్రోకర్ ఫిష్ ఇంత ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారట. ఈ చేపను నిజానికి రూ.8.6 మిలియన్లకు వేలం వేస్తే యజమాని దానిని రూ.7.2 మిలియన్లకు విక్రయించి డిస్కౌంట్ ఇచ్చాడట. అరుదైన క్రోకర్ ఫిష్‌కు చైనా, యూరప్‌లతో పాటు పలు దేశాల్లో వైద్యంలో ఉపయోగించడం వల్ల ఎక్కువ డిమాండ్ ఉంది.
yanam : యానాం మత్స్యకారులకు దొరికిన 20కిలోల పండుగప్ప చేప .. పంట పండిందంటున్న గంగపుత్రులు
క్రోకర్ ఫిఫ్ యొక్క గాలి మానవ శరీరంలోని అంతర్గత అవయవాల శస్త్ర చికిత్సల సమయంలోనూ మరీ ముఖ్యంగా గుండెకు శస్త్ర చికిత్స సమయంలో కుట్టడానికి కూడా ఉపయోగిస్తారట.