Viral Video: మటన్ కర్రీ చేస్తున్న భార్య..రొమాంటిక్ భర్త కొంటె పని
భర్త కోసం మటన్ కూర వండుతున్న భార్య..బయటకెళ్లి వచ్చిన భర్త ఇచ్చిన అపురూపమైన గిఫ్టులో చేసిన కొంటెపని వైరల్ గా మారింది.

Pakistani Man Surprises Wife With A Cute Gift
Pakistani man surprises wife with a cute gift : ‘సరసాలు చాలు శ్రీవారూ వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు’ అనే అక్కినేని నాగార్జున అమల శివ సినిమాలో పాటలాంటి ఓ భర్తగారి కొంటెపని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యాభర్తలన్నాక చిలిపి పనులు..కొంటెపనులు సర్వసాధారణమే. కానీ కొన్ని ఫన్నీగా మారి వైరల్ అవుతుంటాయి. భార్యలు సిగ్గుల మొగ్గలు అయ్యేలా చేస్తుంటాయి. అటువంటిదే ఓ భర్తగారి కొంటెపని ఏంటో చూద్దాం..
తమ భార్యలను సంతోషపెట్టేందుకు ఎంతోమంది భర్తలు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ.. టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ అనుకోకుండా రొమాంటిగ్ గా భర్త చేసే చిలిపి పనుల ముందు ఎలాంటి గిఫ్టులైనా టూర్లు అయినా వెలవెలబోవాల్సిందే. అటువంటిదే ఈ భర్త చేసిన పని. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన భార్యను సంతోషపెట్టేందుకు చేసి ఫన్నీ మూమెంట్ కాస్తా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Read more :Karnataka Man : ఇష్టమైన కారుతో 17 ఏళ్లుగా అడవిలోనే
పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన కంటెంట్ సృష్టికర్త బిలాల్ ఖాన్ తన భార్య దువా సిద్ధిఖీని ఎర్రగులాబీతో సర్పైజ్ చేశాడు. భర్త చేసిన ఈ కొంటె పనికి.. ఆమె సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వింది. అందుకు సంబంధించిన వీడియోను బిలాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. సెప్టెంబర్ 23న పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి.
ఈ వీడియోలో భర్త్ బయట నుంచి ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు, పండ్లను కొని బిలాల్ ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చినవాడు వాటిని తీసుకుని ఇంటిలోకి వెళ్లకుండా ఇంటి బయటే కారులోనే ఉండి భార్య పిలుస్తాడు. లోపల నుంచి ఆమె బయటికి వస్తుంది. భార్య కారు దగ్గరకి వచ్చీ రాగానే ఎర్ర గులాబీని ఇస్తాడు. ఏమాత్రం ఆమె అది ఊహించకపోవటంతో ఆమె మొహంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆమె నవ్వుతూ ‘మాంసం పొయ్యి మీద ఉంది, ఇక్కడ ప్రేమకు మాత్రం ముగింపు లేదు. ఆ అరటి పండ్లు ఇలా ఇవ్వండి’ అంటంది సిగ్గుపడుతునే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read more :Karnataka Man : ఇష్టమైన కారుతో 17 ఏళ్లుగా అడవిలోనే
భర్త చేసిన ఈ చిలిపి పనికి డబ్బులు ఖర్చు ఏమీ కావు. కేవలం అక్కడ ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. భార్యమీద ప్రేమ ఉంటే పెద్ద పెద్ద గిఫ్టులు ఇచ్చేయక్కర్లేదు. ఏదో విదేశీ టూర్లకు తీసుకెళ్లక్కర్లేదు. ఒక్క పువ్వు చాలు తన ప్రేమను భార్యకు తెలియజేయటనాకి. బయటకు వెళ్లిన భర్త ఏ డైమండ్ నెక్లెస్ తోను సర్ ప్రైజ్ చేయక్కర్లేదు. గుప్పెడు మల్లెపువ్వులు మనస్ఫూర్తిగా తెచ్చి భార్య చేతిలో పెడితే చాలు ఆమె మనసు దోచుకోవటానికి. ఇలా మనసులో ప్రేమ ఉండాలే గానీ చిన్న చిన్న పనులతోనే భార్యల్ని ఆనందంగా ఉంచొచ్చు..తద్వారా తాము కూడా సంతోషంగా ఉండొచ్చు. చిరునవ్వుతో భార్య అందించే ఓ కప్పు కాఫీ భర్తకు ఎంత భరోసా ఇస్తుందో..ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇంటిని ఆనందంలో విహరించేలా చేస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.
View this post on Instagram