Karnataka Man : ఇష్టమైన కారుతో 17 ఏళ్లుగా అడవిలోనే

ఇష్టమైన కారుతో 17 ఏళ్లుగా ఓ వ్యక్తి అడవిలోనే ఉంటున్నాడు. ఆ కారుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా..దానికి ప్లాస్టిక్ కవర్ కప్పి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు.

Karnataka Man : ఇష్టమైన కారుతో 17 ఏళ్లుగా అడవిలోనే

Karnataka Man

Man Has Lived Forest For 17 Years : ఇష్టమైన కారుతో 17 ఏళ్లుగా ఓ వ్యక్తి అడవిలోనే ఉంటున్నాడు. ఆ కారుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా..దానికి ప్లాస్టిక్ కవర్ కప్పి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. అడవిలో ఉన్న వనరులు, జంతువులకు మాత్రం అతను ఏ మాత్రం నష్టపరచలేదు. అయితే..అతను అడవిలో ఉండటానికి ఓ కారణం ఉంది. ఏళ్లుగా ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఈ వ్యక్తి గురించి అధికారులకు తెలిసింది. జిల్లా కలెక్టర్ స్వయంగా అతని వద్దకు వెళ్లి…వివరాలు ఆరా తీశారు. కట్టించిన ఇల్లు ఇస్తానని చెప్పినా..ఆ వ్యక్తి సున్నితంగా తిరస్కరించారు.

Read More : Playboy Model: కుక్క పేరు మీద రూ.15 కోట్ల విలువైన ఆస్తి రాసిన మోడల్

Lived Forest

Lived Forest

 

వివరాల్లోకి వెళితే…
కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లా నెక్రల్ – కెమ్రాజీ అనే గ్రామంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇతనికి 1.5 ఎకరాల పొలం ఉంది. దీనిని సాగు చేసేందుకు 2003లో సహకార బ్యాంకు నుంచి రూ. 40 వేలు రుణం తీసుకున్నారు. ఆ బాకీ తీర్చకపోవడంతో…పొలాన్ని వేలం వేశారు. ఇది భరించలేని..చంద్రశేఖర్ తన కిష్టమైన ‘ప్రీమియర్ పద్మిని’ కారు తీసుకుని సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత..సోదరితో విబేధాలు వచ్చాయి. సొంత గ్రామానికి వెళ్లలేక…ఆత్మగౌరవం అడ్డొచ్చి…తీవ్ర అసంతృప్తితో సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో అద్దెల్ – నెక్కారే అడవిలోకి వెళ్లిపోయాడు.

Read More : Lakhimpur Kheri : విచారణకు ఆశిష్ మిశ్రా…అరెస్టు చేస్తారా ?

అక్కడనే ఉండిపోయాడు. కారుకు ఏమి కాకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్ కప్పాడు. అయితే..జీవనోపాధి కోసం బుట్టలు అల్లడం ప్రారంభించాడు. వీటిని సమీప గ్రామంలో విక్రయిస్తూ…వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకుంటూ..జీవనం సాగించాడు. ఓ చిన్న గుడిసెలో ఉంటున్న ఇతని వద్ద ఓ రెడియో, పాత సైకిల్ మాత్రమే ఉన్నాయి. అడవిలో ఒంటరిగా నివాసం ఉంటున్న చంద్రశేఖర్ పరిస్థితి గురించి…జిల్లా కలెక్టర్ ఇబ్రహీంకి తెలిసింది. స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇల్లు కట్టించి ఇచ్చినా..దానిని సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం ఇతని వయస్సు 56 సంవత్సరాలు.