Lakhimpur Kheri : విచారణకు ఆశిష్ మిశ్రా…అరెస్టు చేస్తారా ?

కార్యాలయానికి రావాలని కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా నివాసం వద్ద నోటీసు అంటించారు. క్రైం బ్రాంచ్ విచారణకు ఆశిష్ మిశ్రా... హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

Lakhimpur Kheri : విచారణకు ఆశిష్ మిశ్రా…అరెస్టు చేస్తారా ?

Up Police

Minister’s Son Ashish Mishra : ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరిలో ఆందోళనలు, నిరసనలు ఇంకా చల్లారడం లేదు. లఖింపూర్‌ ఖేరీలో నిరసన చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లడంతో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కారణం కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో…యూపీ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. సమన్లు జారీ చేసినా…2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో…రెండోసారి సమన్లు జారీ చేశారు.

Read More : East Godavari : ఆ గ్రామంలో ఏం జరుగుతోంది ? ఆగని మరణాలు

శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్‌ కార్యాలయానికి రావాలని కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా నివాసం వద్ద నోటీసు అంటించారు. 11 గంటల లోపే…క్రైం బ్రాంచ్ విచారణకు ఆశిష్ మిశ్రా… హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన అనంతరం ఆశిష్ మిశ్రా కనిపించకుండా పోయారు. భారత్ – నేపాల్ సరిహద్దులో ఇతను ఉన్నట్లు గాలిస్తున్న పోలీసు బృందం గుర్తించినట్లు సమాచారం.

Read More : TN’s Karur : వ్యాక్సిన్ వేయించుకుంటే..వాషింగ్ మెషిన్, గ్రైండర్, వెట్ గ్రైండర్ గిఫ్ట్స్

ఆయన అదృశ్యంపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. తన కుమారుడు ఎక్కడకు పారిపోలేదని, ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై వివరణ ఇచ్చారాయన. తన కుమారుడికి పోలీసులు గురువారం సమన్లు ఇచ్చారని, అయితే ఆరోగ్య కారణాల వల్ల పోలీసుల ఎదుటకు శుక్రవారం రిపోర్ట్‌ చేయలేకపోయినట్లు అజయ్‌ మిశ్రా చెప్పారు. తన కుమారుడు పోలీసులకు 2021, అక్టోబర్ 09వ తేదీ శనివారం రిపోర్ట్‌ చేస్తాడన్నారు.

Read More : Facebook Apology : మళ్లీ అంతరాయం, క్షమాపణలు చెప్పిన ఫేస్ బుక్

మరోవైపు…ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలున్నాయని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణలోగా.. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి విచారణను 2021, అక్టోబర్ 20కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం విచారణకు హాజరైన ఆశిష్ మిశ్రా..ను అరెస్టు చేస్తారా ? లేదా ? అనేది తెలియరాలేదు.