Playboy Model: కుక్క పేరు మీద రూ.15 కోట్ల విలువైన ఆస్తి రాసిన మోడల్
తన పేరు మీద ఉన్న రూ.15కోట్ల ఆస్తి మొత్తాన్ని పెంపుడు కుక్క మీద రాసేసింది ఓ మోడల్. తనకు పిల్లలు లేరని తన తర్వాత ఆస్తిపై పూర్తి హక్కు కుక్కకేనంటూ వీలునామా రాసింది.
Playboy Model: తన పేరు మీద ఉన్న రూ.15కోట్ల ఆస్తి మొత్తాన్ని పెంపుడు కుక్క మీద రాసేసింది ఓ మోడల్. తనకు పిల్లలు లేరని తన తర్వాత ఆస్తిపై పూర్తి హక్కు కుక్కకేనంటూ వీలునామా రాసింది. ఫ్రాన్సిస్కో లాయర్లను సంప్రదించి ప్రాపర్టీ మొత్తానికి.. (అపార్ట్మెంట్లు, కార్లు) ఓనర్ అయిపోయింది.
మోడల్ జు ఐసెన్.. సంపాదించిన డబ్బు తన కుక్కకు కంఫర్ట్ ఇస్తుందని, తను బతికినంత కాలం సంరక్షించిన వారు ఆస్తిని అనుభవించొచ్చని చెప్పారు. పిల్లలు కనడానికి కూడా ఇది సమయం కాదని చెప్తుందామె. ‘నా ఎదుగుదల కోసం కష్టపడ్డాను. ఇక భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది’ అందుకే ఇలా చేసినట్లు చెప్పింది.
తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కుక్కతో పాటు ప్రైవేట్ జెట్స్ లో ప్రయాణించిన ఫొటోలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా స్పెషల్ అవుట్‌ఫిట్స్‌లో స్టైలిష్ గా కనిపించేది.
Vitamin D : విటమిన్ డి కోసం ఎండలో ఎంత సేపు ఉండాలంటే?..
ఈ సంవత్సరారంభంలో రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కొత్త యువతిలా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ‘నా గతమంతా తుడిచేయాలి. అద్దంలో కూడా కొత్తగా కనిపించాలే తయారయ్యా. ఇప్పుడు నేనొక కొత్త మనిషిని’ అని ట్వీట్ చేశారు.
ఈ ప్లే బాయ్ మోడల్ మొత్తం నాలుగు లిపోసక్షన్ ప్రొసీజర్స్ సర్జరీలు చేయించుకుంది. నాలుగు ఫేసియల్ హార్మోనైజేషన్, హైలోర్నిక్ యాసిడ్, మెతాక్రైల్ ట్రీట్మెంట్ కూడా ముఖానికి చేయించుకుంది.