PakVac Covid Vaccine : పాకిస్తాన్ హోం మేడ్ కొవిడ్ వ్యాక్సిన్‌కు చైనా సాయం
పాకిస్తాన్ హోం మేడ్ యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. అది కూడా మిత్రదేశమైన డ్రాగన్ చైనా సాయంతో.. పాక్ స్వదేశీ యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొస్తోంది.

Pakvac Covid Vaccine
PakVac Home Made Vaccine : దయాది పాకిస్తాన్ హోం మేడ్ యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. అది కూడా మిత్రదేశమైన డ్రాగన్ చైనా సాయంతో.. పాక్ స్వదేశీ యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొస్తోంది. దేశంలో ప్రజలందరికి కరోనా టీకాలు వేసేందుకు PakVac అనే యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానుంది. పాకిస్తాన్ క్లిష్ట సవాళ్లను అధిగమించి మిత్రదేశం సాయంతో వాటిని అవకాశాలుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది.
కొవిడ్ సవాలును అధిగమించడంలో మిత్రదేశం చైనా తమకు అత్యంత సన్నిహితంగా ఉందని ఆకాశంలో డాక్టర్ సుల్తాన్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీకా కోసం ముడిసరుకును చైనా అందించినప్పటికీ, దానిని అభివృద్ధి చేయడం అంత సులభం కాదన్నారు.
టీకా స్థానిక భారీ ఉత్పత్తి రాబోయే రోజుల్లో ప్రారంభమవుతుందని సుల్తాన్ తెలిపారు. పాకిస్థాన్‌కు ఇది ముఖ్యమైన రోజు అని నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్స్ సెంటర్ (NCOC) చీఫ్ అసద్ ఉమర్ అన్నారు. పాకిస్తాన్‌లో గత 24 గంటల్లో 1,771 కొత్త కేసులు నమోదయ్యాయి. మూడు నెలల్లో మొదటిసారిగా పాజిటివిటీ రేటు 4 శాతానికి తగ్గింది.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 922,824గా ఉందని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. పాక్‌లో వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇప్పటివరకు 5.3 మిలియన్ల మందికి టీకాలు తీసుకున్నారు. అలాగే 7.3 మిలియన్లకు పైగా మోతాదులను అందించారు. ఇందులో 2 మిలియన్ల మంది పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నారు.