Gold Mine Fire: పెరూలోని బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 27 మంది కార్మికులు మృతి

లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన పెరూలో రెండు దశాబ్దాలకు పైగా జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదాల్లో ఇది ఒకటని స్థానిక అధికారులు తెలిపారు.

Gold Mine Fire: పెరూలోని బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 27 మంది కార్మికులు మృతి

Peru Gold Mine

Updated On : May 8, 2023 / 8:18 AM IST

Gold Mine Fire: దక్షిణ పెరూలో విషాదం చోటు చేసుకుంది. బంగారు గనిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పెరూలోని అరెక్విపా ప్రాంతం లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని అత్యంత విషాదకరమైన మైనింగ్ ప్రమాదాల్లో ఇది ఒకటి. ప్రమాదం జరిగిన సమయంలో ఈ గనిలో పనిచేస్తున్న 175 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు యానాకిహువా మైనింగ్ కంపెనీ తెలిపింది. ప్రమాదవశాత్తూ 27 మంది ఆ మంటల్లో చిక్కుకొని మరణించినట్లు మైనింగ్ కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Pakistan Flight: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం.. దాదాపు పది నిమిషాలు చక్కర్లు.. అసలేం జరిగిందంటే..

గనిలో పేలుడు ఘటన చోటుచేసుకున్న సమయంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ మంటలు గనిలోని చెక్క బ్లాకుల ద్వారా వ్యాపించాయి. ఆ సమయంలో కార్మికులు భూమికి 100 మీటర్ల లోతులో ఉన్నారు. చనిపోయిన వారిలో చాలా మంది దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు తెలిసింది. 27 మంది కార్మికుల మరణాలను ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అయితే, ప్రమాదం జరిగినప్పుడు గనిలో ఎంతమంది ఉన్నారనేది స్పష్టత రాలేదు.

Kerala Boat Capsizes : కేరళలో ఘోర ప్రమాదం.. టూరిస్ట్ బోటు బోల్తా, 20మంది మృతి

ఆదివారం ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. గనిలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన పెరూలో రెండు దశాబ్దాలకు పైగా జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదాల్లో ఇది ఒకటని స్థానిక అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ప్రతీయేటా 100 టన్నుల బంగారాన్ని వెలికితీస్తుంటారు. బంగారం ఉత్పత్తిలో పెరూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, పెరూ రెండవ అతిపెద్ద రాగి ఉత్పత్తిదారు కూడా.