Kerala Boat Capsizes : కేరళలో ఘోర ప్రమాదం.. టూరిస్ట్ బోటు బోల్తా, 20మంది మృతి

Kerala Boat Capsizes : మలప్పురం జిల్లా తానూరు బీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బోటులో 30మంది ప్రయాణికులు ఉన్నారు.

Kerala Boat Capsizes : కేరళలో ఘోర ప్రమాదం.. టూరిస్ట్ బోటు బోల్తా, 20మంది మృతి

Kerala Boat Capsizes

Kerala Boat Capsizes : కేరళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విహారయాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నదిలో మునిగి 20మంది చనిపోయారు. కొంతమంది లైఫ్ జాకెట్లు వేసుకోకపోవడంతో నీళ్లలో మునిగి మరణించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

మలప్పురం జిల్లా తానూరు బీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బోటులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురు గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 8మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది.

Also Read..GPS Car : OMG.. ప్రాణాలకు మీదకు తెచ్చిన GPS, సముద్రంలోకి దూసుళ్లిన కారు.. షాకింగ్ వీడియో

ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అదో డబుల్ డెక్కర్ బోటు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పోలీస్, ఫైర్, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. స్థానికంగా ఉండే మత్స్యకారులు, స్థానికులు కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

బోల్తా పడిన బోటుని భారీ క్రేన్ల సాయంతో బయటకు తీశారు. అందులోంచి మృతదేహాలను వెలికితీశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ.

Also Read..Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం

వెలుతురు సరిగా లేకపోవడం, ఇరుక్కుగా ఉన్న రోడ్లతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాగా, బోటులో సామర్ధ్యానికి మంచి ప్రయాణికులను ఎక్కించారని, వారికి కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలం సముద్రానికి దగ్గరలోనే ఉంది. తీరానికి 300 మీటర్ల దూరంలో బోటు ఒకవైపుకి ఒరిగిపోయింది.