Philippine storm : తీవ్ర విషాదం నింపిన సునామీ భయం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పర్వతం ఎక్కిన 80మంది దుర్మరణం
దక్షిణ మాగ్విండనావో ప్రావిన్స్ లోని కుసియోంగ్ గ్రామస్తులు.. సునామీ అనుకుని ప్రాణ భయంతో సమీపంలోని ఓ పర్వతంపైనున్న చర్చి దగ్గరికి పరుగులు తీశారు.

Philippine storm : ఫిలిప్పీన్స్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నల్గే తుపాన్ వల్ల సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడ్డాయి. వీటిని చూసిన దక్షిణ మాగ్విండనావో ప్రావిన్స్ లోని కుసియోంగ్ గ్రామస్తులు.. సునామీ అనుకుని ప్రాణ భయంతో సమీపంలోని ఓ పర్వతంపైనున్న చర్చి దగ్గరికి పరుగులు తీశారు. అయితే దురదృష్టవశాత్తు పర్వతం పైనుంచి వరదతో పాటు బురద వచ్చి ప్రజలపై పడింది. ఈ ఘటనలో 80 మందికిపైగా సజీవ సమాధి అయినట్టు సమాచారం. ఇప్పటివరకు 20 మృతదేహాలు వెలికితీశారు.
80 నుంచి 100 మంది కుటుంబాలతో సహా బురదలో సజీవ సమాధి అయినట్లు అధికారులు చెబుతున్నారు. సునామీ నుంచి కాపాడుకునేందుకు వారు ప్రయత్నం చేస్తే అది బెడిసి కొట్టింది. మృత్యువు మరో రూపంలో కబళించింది. సునామీ నుంచి కాపాడుకునేందుకు వారంతా ఆరాటపడ్డారు. హమ్మయ్య పర్వతంపైకి వచ్చాము ఇక ప్రాణాలకు భయం లేదని అనుకున్నారు. కానీ, అంతలోనే దారుణం జరిగిపోయింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఫిలిప్పీన్స్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు 1976 ఆగస్టులో జరిగింది. 8.1 తీవ్రతతో వచ్చిన భూకంపం, సునామీ వేల మందిని పొట్టన పెట్టుకున్నాయి. రాత్రికి రాత్రి అంతా మరణించారు. ఫిలిప్పీన్స్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు అది.