philippines : కుప్పకూలిన మిలటరీ విమానం.. 87 మంది సైనికులతో వెళ్తుండగా ప్రమాదం..

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఆదివారం 92 మందితో వెళ్తున్న సైనిక విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 40 మందిని రక్షించినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన సి -130 విమానం జోలో ద్వీపంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది.

philippines : కుప్పకూలిన మిలటరీ విమానం.. 87 మంది సైనికులతో వెళ్తుండగా ప్రమాదం..

Philippines

Updated On : July 4, 2021 / 12:32 PM IST

philippines : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఆదివారం 92 మందితో వెళ్తున్న సైనిక విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 40 మందిని రక్షించినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన సి -130 విమానం జోలో ద్వీపంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది.

military plane carrying least 85 people crashed southern Philippines 15 people rescues Foreign Media

“సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. తమ ప్రాథమిక నివేదిక ప్రకారం విమానంలో ముగ్గురు ఫైలెట్లు, ఐదుగురు సిబ్బందితో సహా 92 మంది ప్రయాణిస్తున్నట్లు ఫిలిప్పీన్స్‌ రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజానా  చెప్పారు.

 

40 మందిని రక్షించామని, ఇప్పుడు వారు చికిత్స పొందుతున్నారని సాయుధ దళాల చీఫ్ సిరిలిటో సోబెజన మీడియాకు తెలిపారు.