వైరల్ ఫోటో….గాయపడిన తెల్లజాతీయుడిని భుజాలపై మోసిన నల్లజాతీయుడు

జాత్యహంకార నిరసనల్లో గాయపడిన ఓ తెల్ల జాతీయుడిని కాపాడేందుకు ఓ నల్ల జాతీయ నిరసనకారుడు అతడిని తన భుజాలపై మోస్తూ తీసుకెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. శనివారం లండన్ లో ప్రతి-నిరసనలతో శాంతియుత జాత్యహంకార వ్యతిరేక ప్రదర్శనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
ఆందోళన సమయంలో రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ డెలిన్ మార్టినెజ్ తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. జాత్యహంకార వ్యతిరేక ఆందోళనలో గాయపడిన శ్వేతజాతీయుడిని తన భుజం మీద ‘ఫైర్‌మ్యాన్స్ లిఫ్ట్’లో ఒకనల్లజాతి నిరసనకారుడు మోస్తున్నట్లు కనిపిస్తున్న ఆ ఫోటోన్యూస్ బులెటిన్లలో కూడా ప్రదర్శించబడింది.
ఈ సందర్భంగా డెలిన్ మార్టినెజ్ ఆ ఫోటో తీసిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ…సెంట్రల్ లండన్ లోని వాటర్లూ వంతెన సమీపంలో ఒక వాగ్వివాదం మరియు ఎవరో నేలమీద పడటం చూశాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు గుంపు నుంచి కనిపించారు. నా కళ్ళెదురుగానే గుంపులుగా వున్నా జనం ఒక్కసారిగా విడిపోయారు.
నేను సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నాను. గాయపడిన తెల్ల జాతీయుడిని ఓ నల్ల జాతీయుడు భుజాలపై మోసుకొని నా వైపు వేగంగా నడుస్తూ వస్తున్నా సమయంలో ఫోటోని తీసాను. నల్ల జాతీయుడు భుజాలపై మోసుకొని తీసుకువెళ్ళిన వ్యక్తి ముఖానికి గాయాలు ఉన్నాయని మార్టినెజ్ చెప్పాడు, సంఘటన స్థలంలో ఉన్న రాయిటర్స్ జర్నలిస్టులు జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులతో వాగ్వివాదంలో కొట్టబడ్డారని చెప్పాడు
మే 25 న అమెరికాలోని మిన్నియాపోలిస్ సిటీ పోలీసుల కస్టడీలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మరణించిన తరువాత అమెరికా, బ్రిటిష్ నగరాల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే.