Gold From Lead: వావ్.. సీసం నుంచి బంగారం.. సైంటిస్టులు గ్రాండ్ సక్సెస్.. అదే జరిగితే భారీగా తగ్గనున్న పసిడి ధరలు..?

లెడ్ నుంచి గోల్డ్ తయారీ ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఇదెలా సాధ్యమైంది..

Gold From Lead: వావ్.. సీసం నుంచి బంగారం.. సైంటిస్టులు గ్రాండ్ సక్సెస్.. అదే జరిగితే భారీగా తగ్గనున్న పసిడి ధరలు..?

Updated On : May 11, 2025 / 7:42 PM IST

Gold From Lead: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి పసిడి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల గోల్డ్ ధర లక్ష మార్క్ ను కూడా తాకింది. దీంతో పుత్తడి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనాలు. భవిష్యత్తులో రవ్వంత బంగారం అయినా కొనగలమా అని ఆందోళన చెందుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో సైంటిస్టులు అద్భుతం చేశారు. సీసం(Lead) నుంచి బంగారం తయారు చేశారు. సీసాన్ని గోల్డ్ మా మార్చడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ ‌(సీఈఆర్ఎన్)లోని భౌతిక శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా సమీపంలోని సీఈఆర్ఎన్ ల్యాబోరేటరీలో సీసాన్ని బంగారంగా మార్చారు.

ఇలా..సీసాన్ని బంగారం మార్చారు..
లెడ్ నుంచి గోల్డ్ తయారీ ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఇదెలా సాధ్యమైంది అని తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. లెడ్ నుంచి గోల్డ్ ఎలా తయారు చేశారో సైంటిస్టులు వివరించారు.

Also Read: ఈ SWP స్కీమ్‌లో పెట్టుబడి పెడితే చాలు.. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. లక్ష సంపాదించొచ్చు.. ఇదిగో ఇలా..!

”సీస కేంద్రకాల అధిక శక్తి, ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల (సీసానికి 82, బంగారానికి 79) వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే. అయినప్పటికీ, కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాలలోని అయాన్లు అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనకుండా ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం.. శక్తి పల్స్‌ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి మూడు ప్రోటాన్‌లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది” అని శాస్త్రవేత్తలు వివరించారు.

కాగా సీసం బంగారంగా మారడాన్ని గతంలోనే గుర్తించారు. సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్ అనే మరొక సీఈఆర్ఎన్ యాక్సిలరేటర్.. 2002 నుంచి 2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించింది. తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయని, ఈ విధానంలో మరింత ఎక్కువ గోల్డ్ సృష్టించవచ్చని చెబుతున్నారు. ఈ పద్ధతిలోనే మరింత పుత్తడి ఉత్పత్తి చేస్తే బంగారం సరఫరా పెరుగుతుంది. సప్లయ్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గుతాయని, అతి తక్కువ ధరలకే పుత్తడి అందుబాటులోకి వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు.