Pilot dies : విమానం బాత్రూంలో పైలట్ మృతి, కోపైలట్‌ అత్యవసర ల్యాండింగ్

మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానం పైలట్ గుండెపోటుతో మరణించడంతో కో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. 271 మంది ప్రయాణికులతో శాంటియాగోకు బయలుదేరిన లాటాం ఎయిర్‌లైన్స్ విమాన పైలట్ 56 ఏళ్ల ఇవాన్ అందౌర్ రాత్రి 11 గంటలకు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలి మరణించారు....

Pilot dies : విమానం బాత్రూంలో పైలట్ మృతి, కోపైలట్‌ అత్యవసర ల్యాండింగ్

Pilot dies in bathroom of plane

Updated On : August 17, 2023 / 11:50 AM IST

Pilot dies in bathroom of plane : మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానం పైలట్ గుండెపోటుతో మరణించడంతో కో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. 271 మంది ప్రయాణికులతో శాంటియాగోకు బయలుదేరిన లాటాం ఎయిర్‌లైన్స్ విమాన పైలట్ 56 ఏళ్ల ఇవాన్ అందౌర్ రాత్రి 11 గంటలకు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. (Pilot dies in bathroom of plane) దీంతో ఎయిర్‌క్రాఫ్ట్ కో-పైలట్‌లు పనామా నగరంలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. (co-pilots make emergency landing)

Flash Floods : హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి పెరిగిన మృతుల సంఖ్య

విమానంలో ప్రయాణిస్తున్న ఇసడోరా అనే నర్సు, ఇద్దరు వైద్యులు విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో పైలట్‌కు చికిత్స చేసేందుకు యత్నించినా కాపాడలేక పోయారు. విమానాన్ని కో పైలెట్లు పనామా సిటీలో ల్యాండ్ చేయించిన తర్వాత పరీక్షించగా పైలట్ మరణించినట్లు ప్రకటించారు. విమాన ప్రయాణికులకు పనామా సిటీ హోటళ్లలో వసతి కల్పించారు.

Texas woman arrest : జడ్జీనే చంపేస్తానని బెదిరించిన టెక్సాస్ మహిళ అరెస్ట్

పైలట్ మృతి ఘటనపై లాటాం ఎయిర్ లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. లాటాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (LATAM Airlines flight) సమయంలో ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. పైలట్ మరణించినా కోపైలట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించడంతో విమాన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.