Pakistan : పాకిస్థాన్‌లో కలకలం…4 లక్షల మందికి కండ్లకలక

మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో పింక్ ఐ ఎపిడెమిక్ కలకలం సృష్టిస్తోంది. కేవలం ఒక్క రోజే 13వేల మంది విద్యార్థులకు కండ్లకలక అంటువ్యాధి సోకడంతో వారు ఇంట్లోనే ఉండాలని వైద్యాధికారులు సూచించారు....

Pakistan : పాకిస్థాన్‌లో కలకలం…4 లక్షల మందికి కండ్లకలక

Pink Eye Epidemic

Updated On : October 6, 2023 / 11:18 AM IST

Pakistan : మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో పింక్ ఐ ఎపిడెమిక్ కలకలం సృష్టిస్తోంది. కేవలం ఒక్క రోజే 13వేల మంది విద్యార్థులకు కండ్లకలక అంటువ్యాధి సోకడంతో వారు ఇంట్లోనే ఉండాలని వైద్యాధికారులు సూచించారు. కండ్లకలక వ్యాధి పాకిస్థాన్ దేశంలో ప్రబలడంతో లక్షలాది మంది బాధపడుతున్నారు. కంటి ఇన్ఫెక్షన్‌ల కారణంగా పాకిస్థాన్‌లో 56,000 పాఠశాలలు మూతపడ్డాయి. కండ్లకలక అని కూడా పిలిచే వైరల్ పింక్ ఐ ఎపిడెమిక్ పాకిస్థాన్‌ దేశంలో లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది.

Also Read : Manipur : కల్లోల మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం

పాక్ లో గత కొన్ని నెలలుగా వేసవి వేడిగాలులు, రికార్డు వర్షపాతంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ అంటు వ్యాధి క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి వ్యాప్తితో పాక్ ఆరోగ్యశాఖ అధికారులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో తేమతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్థాన్‌లో 400,000 మంది ప్రజలు వైరల్ కండ్లకలక వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి వ్యాప్తి గత వారం గరిష్ఠ స్థాయికి చేరింది.

Also Read : MAD Movie Review : ‘మ్యాడ్’ సినిమా రివ్యూ.. రెండు గంటల పాటు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు..

పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం ఒకే రోజు 10,000 కేసులు, మంగళవారం 13,000 కొత్త కేసులు నమోదయ్యాయి. కండ్లకలక అనేది కంటి వాపు వ్యాధి. ఇది కంటి ముందు, కనురెప్పలను కప్పి ఉంచే శ్లేష్మ పొర. ఇది బాక్టీరియా లేదా వైరస్‌ల వల్ల సంభవించవచ్చు. పలు రకాల వైరస్‌లు కండ్లకలకకు కారణమవుతాయి.

Also Read : Drone Attack : సిరియన్ మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి…100 మందికి పైగా మృతి, 125 మందికి గాయాలు

75 శాతం ఇన్ఫెక్షియస్ కంజుంక్టివిటిస్ అడెనోవైరస్ వల్ల ఈ కండ్లకలక వస్తుందని సిడ్నీలో ఆప్టోమెట్రీ, విజన్ సైన్స్ ప్రొఫెసర్ ఇసాబెల్లె జల్బర్ట్ చెప్పారు. పాఠశాలలను మూసివేయడం వల్ల అడెనోవైరస్‌ల వ్యాప్తిని తాత్కాలికంగా తగ్గించవచ్చు. అయితే పాఠశాలలు తిరిగి తెరిచినప్పుడు కండ్లకలక అంటువ్యాధి మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని పాక్ ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.