Plane Crash : అమెరికాలో కుప్పకూలిన విమానం..ఇద్దరు మృతి

అమెరికాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలో రోడ్డుపైకి విమానం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Plane Crash : అమెరికాలో కుప్పకూలిన విమానం..ఇద్దరు మృతి

Plane Crash

Updated On : October 12, 2021 / 8:15 AM IST

Plane crash in America : అమెరికాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలో రోడ్డుపైకి విమానం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుపై పార్క్‌ చేసి ఉన్న ఓ ట్రక్కును విమానం డీకొట్టింది.  అయితే ఆ ట్రక్కులో ఎవరైనా ఉన్నారా లేదా అన్నదానిపై నెలకొన్న సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది.

అందులో డ్రైవర్‌ ఉన్నాడో లేడో తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది. ఎందుకంటే ట్రక్కు నుజ్జునుజ్జు ఐపోయింది. ఇక విమానం క్రాష్‌ అయినప్పుడు వచ్చిన శబ్దానికి అక్కడి ప్రజలు హడలిపోయారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగుల తీశారు.

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

ఇక విమానం క్రాష్‌ అవ్వగానే అందులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి సమీపంలోని భవనాలకు అంటుకున్నాయి. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ప్రజలు.. బిల్డింగ్‌ల నుంచి రోడ్లపైకి వచ్చేశారు. చూస్తుండగానే మంటలు ఒక భవనం నుంచి మరో భవనానికి వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో ఇదంతా జరగడంతో ప్రజలు వణికిపోయారు.

ఇంతలోనే ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అటు ఘటన జరిగిన కొన్ని కిలోమీటర్ల దూరంలో వేల మంది విద్యార్థుల ఉన్న ఓ హై స్కూల్‌ ఉంది. సమాచారం అందిన వెంటనే ముందు జాగ్రత్తగా స్కూల్‌లోని విద్యార్థులను వేరే ప్రాంతానికి తరలించేశారు.