PM Modi visit : ముగిసిన ఫ్రాన్స్ పర్యటన..అబుదాబీకి వచ్చిన మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం రెండురోజుల ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్నారు. ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్న మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వచ్చారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు అమ్మాన్యుయేల్ మాక్రాన్ తో మోదీ చర్చలు జరిపారు....

PM Modi visit : ముగిసిన ఫ్రాన్స్ పర్యటన..అబుదాబీకి వచ్చిన మోదీ

PM Modi visit

Updated On : July 15, 2023 / 5:47 AM IST

PM Modi visit : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం రెండురోజుల ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్నారు. ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్న మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వచ్చారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు అమ్మాన్యుయేల్ మాక్రాన్ తో మోదీ చర్చలు జరిపారు. ఫ్రాన్స్ దేశ పర్యటన సందర్భంగా మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర, సైనిక గౌరవ పురస్కారం గ్రాండ్ క్రాస్ ను ప్రదానం చేశారు. భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికామని మోదీ పేర్కొన్నారు. (PM Modi France visit)

Triple Talaq :యూపీలో దారుణం… నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్

ఫ్రాన్ దేశ పర్యటన ముగించుకున్న మోదీ శనివారం అబుదాబీకి చేరుకున్నారు. ‘‘భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన మోదీ తదుపరి పర్యటన కోసం ఇప్పుడు అబుదాబికి బయలుదేరారు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. (PM Modi emplanes for UAE) అబుదాబీలో ఆహార భద్రత, రక్షణరంగాలపై దృష్టి కేంద్రీకరించి యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరుపుతారు.

Upasana : మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్‌ని డిజైన్ చేయించిన ఉపాసన.. వీడియో వైరల్!

తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి భారత్, ఫ్రాన్స్ 25 ఏళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. స్నేహపూర్వక దేశాల ప్రయోజనాలతో సహా కీలకమైన సైనిక ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధికి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు భారత్, ఫ్రాన్స్ శుక్రవారం తెలిపాయి.