పేదరికాన్ని పుస్తకాల్లో చదవి తెలుసుకోలేదు.. మోడీ

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (అక్టోబర్ 29, 2019)న ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ ఇనిషియేటివ్ (FII) తో తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడారు. తను పేదరికాన్ని పుస్తకాల్లో చదవలేదని. ఆ పేదరికాన్ని అనుభవించి వచ్చానని చెప్పారు.
రెండు రోజుల సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని రియాద్ లో నిర్వహించిన ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ ఇనిషియేటివ్ (FII) తో మాట్లాడుతూ….నేను రాజకీయ కుటుంబానికి చెందిన వాడిని కాదు, పేదరికాన్ని బుక్స్ లో చదివి తెలుసుకోలేదు.. రైల్వే ప్లాట్ ఫామ్ లో టీ అమ్ముకుని దాన్ని నేరుగా అనుభవించి ఈ స్థాయికి వచ్చాను అన్నారు.