US Secretary: ప్రధాని మోదీపై అమెరికా కార్యదర్శి ప్రశంసల జల్లు
భారత సంస్కృతీ, సంప్రదాయాలు చాలా గొప్పవని, హోళీ వేడుకలో పాల్గొనేందుకే తాను భారత పర్యటనకు ఒకరోజు ముందుగా వచ్చినట్లు గినా పేర్కొన్నారు. రక్షణమంత్రి తన కుటుంబంతో కలిసి తనకు ఆతిథ్యమిచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి మోదీతో గంటన్నరసేపు మాట్లాడేందుకు లభించిన అవకాశాన్ని ప్రస్తావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు

US Secretary Gina Raimondo
US Secretary: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రౌమోండో ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ గొప్ప దార్శనికుడని, భారత ప్రజల పట్ల ఆయన నిబద్ధత వర్ణించలేనిదంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఈమధ్య కాలంలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు మోదీయేనని అన్నారు. కొద్ది రోజుల క్రితమే ఆమె భారతదేశంలో పర్యటించారు. అమెరికా వెళ్లిన అనంతరమే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా అమెరికాలోని ఇండియా భవనంలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ వచ్చిన సమయంలో హోళీ వేడుకలో తాను పాల్గొన్న సంగతులు గుర్తు చేసుకున్నారు.
భారత సంస్కృతీ, సంప్రదాయాలు చాలా గొప్పవని, హోళీ వేడుకలో పాల్గొనేందుకే తాను భారత పర్యటనకు ఒకరోజు ముందుగా వచ్చినట్లు గినా పేర్కొన్నారు. రక్షణమంత్రి తన కుటుంబంతో కలిసి తనకు ఆతిథ్యమిచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి మోదీతో గంటన్నరసేపు మాట్లాడేందుకు లభించిన అవకాశాన్ని ప్రస్తావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన గొప్ప అవకాశమని అన్నారు.