Israel-Hamas War : ఇజ్రాయెల్ ప్రధాని‭తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయనతో ఏం చెప్పారంటే?

నెతన్యాహూ, మోదీ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అయితే మూడు-నాలుగు రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర యుద్ధం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇరు నేతల మధ్య సంభాషణ జరగడం ఇదే మొదటిసారి.

Israel-Hamas War : ఇజ్రాయెల్ ప్రధాని‭తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయనతో ఏం చెప్పారంటే?

Updated On : October 10, 2023 / 3:14 PM IST

Israel-Hamas War : ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‭ నేతన్యాహూతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మీద జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు నేతన్యూహుతో మోదీ అన్నారు. నెతన్యాహు ఫోన్ చేశారని, కష్ట సమయాల్లో తాము ఉన్నామని ఇజ్రాయెల కు భరోసా ఇచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. నెతన్యాహూ, మోదీ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అయితే మూడు-నాలుగు రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర యుద్ధం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇరు నేతల మధ్య సంభాషణ జరగడం ఇదే మొదటిసారి.

తన సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రధాని పోస్ట్ చేస్తూ “నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు” అని రాశారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారని అన్నారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ శనివారం జరిపిన రాకెట్ దాడిని ఉగ్రవాద దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వార్తతో షాక్‌కు గురైనట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ దాడిలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని మోదీ తన సానుభూతిని తెలియజేశారు.