New york Subway Shooting : న్యూయార్క్ మెట్రో సబ్ వే లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ చెబితే 50 వేల డాలర్ల రివార్డు

న్యూయార్క్ మెట్రో సబ్ వే లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ చెబితే 50 వేల డాలర్ల రివార్డు ఇస్తామని పోలీసులు అధికారులు ప్రకటించారు.

New york Subway Shooting : న్యూయార్క్ మెట్రో సబ్ వే లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ చెబితే 50 వేల డాలర్ల రివార్డు

New York Brooklyn Subway Shooting

Updated On : April 13, 2022 / 12:14 PM IST

New york Brooklyn Subway Shooting : న్యూయార్క్ లోని బ్రూక్లిన్ మెట్రో సబ్ వే లో కాల్పులు జరిపిన వ్యక్తి ఫోటోను అధికారులు విడుదల చేశారు. అతని ఆచూకీ తెలిపితే 50,000 డాలర్లు రివార్డు ఇస్తామని అమెరికా అధికారులు ప్రకటించారు. న్యూయార్క్ లోని బ్రూక్లిన్ మెట్రో సబ్ వే లో కాల్పులు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు అనుమానితుడి ఫోటోను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలిపితే 50,000 డాలర్లు రివార్డు ఇస్తామని ప్రకటించారు. కాగా ఈ కాల్పుల వెనుక ఎటువంటి ఉగ్రవాద సంస్థ ప్రమేయం లేదని స్పష్టం చేసింది అమెరికా. బ్రూక్లిన్ మెట్రో సబ్ వే లో ఓ వ్యక్తి 33 సార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.

గ్యాస్ మాస్క్ తో మెట్రో సబ్ వే లోకి చొరబడిన దుండగుడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్దాలను పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also read : Brooklyn Subway Shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

పలువురు వ్యక్తులు రక్తపు గాయాలతో ప్లాట్ ఫామ్ పై పడి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు బ్రూక్లిన్ లోని 36వ స్ట్రీట్ పరిసరాలను మూసివేశారు. పౌరులు ఎవరూ అటుగా వెళ్లొద్దని ఆదేశించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. దేశంలో తుపాకుల వినియోగంపై కొత్త నియంత్రణ చర్యలను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరగడం గమనించాల్సిన విషయం.
కాగా..కాల్పుల ఘటతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని వాపోతున్నారు.