Snake : వ్యక్తి మెడకు చుట్టుకున్న పాము… ఎలా రక్షించారంటే….
హర్రర్ సినిమాను తలపించే సన్నివేశం ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మెడకు పాము చుట్టుకుంది. దీంతో అతను ఊపిరి ఆడక అల్లాడి పోయాడు.

Us Snake
Snake : హర్రర్ సినిమాను తలపించే సన్నివేశం ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మెడకు పాము చుట్టుకుంది. దీంతో అతను ఊపిరి ఆడక అల్లాడి పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంటికి వచ్చి గన్ తో పాము తల కాల్చి అతడిని రక్షించారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి పాములను సేకరిస్తూ ఉంటాడు. అతడి ఇంట్లో చాలా రకాల పాములు ఉన్నాయి. బుధవారం అతడి ఇంట్లోని 15 అడుగుల పాము ఒకటి అతని మెడను చుట్టుకుంది. దీంతో అతనికి ఊపిరి ఆడక గుండెపోటు వచ్చి అపస్మారకస్ధితిలోకి వెళ్లిపోయాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అతని ఇంటికి వచ్చారు. పామును అతడి మెడ నుంచి తీయాలంటే వారి వల్ల కాలేదు. ఎలాగైనా అతడిని పాము బారి నుంచి కాపాడాలనుకున్నారు. అతని మెడకు చుట్టుకున్న పాము తల దూరంగా ఉండటం గమనించాడు పోలీసు ఇన్స్ పెక్టర్. అంతే తన రివాల్వర్ తో పాము తలపై కాల్చాడు.
అంతే పాము అతని మెడను విడిచి జారకుంటూ ముందుకు వెళ్లిపోయింది. వెంటనే అంబులెన్స్ లో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన 19 ఏళ్ల సర్వీసులో ఇలాంటి భయానక ఘటన ఎప్పుడూచూడలేదని ఆ వ్యక్తిని కాపాడిని పోలీసు అధికారి తెలిపాడు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతోనే పాముపై కాల్పులు జరిపినట్లు ఆయన చెప్పాడు.
Also Read : Bengaluru : కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్