Bengaluru : కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bengaluru :  కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

Bengaluru Suspected Terrorist

Bengaluru : కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరూ సిటీ క్రైం బ్రాంచ్   పోలీసులకు  నిందితుడి గురించి కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో తిలక్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బీటీపీ ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కర్ణాటక హోం మంత్రి జ్ఞానేంద్ర తెలిపారు.

అనుమానిత నిందితుడు మరికొందరితో కలిసి ఆభవనంలోని మూడో అంతస్తులో నివిసిస్తున్నాడు. అతనితో పాటు మరో నలుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువకుడి పేరు అక్తర్ హుస్సేన్ అని, అసోంకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. అసోం నుంచి పారిపోయి వచ్చి బెంగుళూరులో తల దాచుకుంటున్నట్లు గుర్తించారు.

తిలక్ నగర్ పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానిత ఉగ్రవాది ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా గత నెలలో హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్ధతో సంబంధం ఉన్న తాలిబ్ హుస్సేన్ బెంగుళూరులో అరెస్టయ్యాడు. తాలిబ్ హుస్సేన్ గత ఆరేళ్లుగా బెంగుళూరులోని ఒకలిపురంలో భార్య ముగ్గురు పిల్లలతో నివిసిస్తున్నాడు.

Also Read : African Swine Flu : కేరళలో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ…190 పందులను వధించిన ప్రభుత్వం